/rtv/media/media_files/2025/03/14/0rcYSdMwi7ed9UddNOoF.jpg)
Veera Dheera Sooran 2
Veera Dheera Sooran 2: చియాన్ విక్రమ్(Chiyaan Vikram) లేటెస్ట్ మూవీ 'వీర ధీర సూరన్ -2' నుండి "కళ్ళల్లో కానరాకున్నా… నీ కోసం నేను వేచున్నా… నిన్నే నా ఏడు జన్మల తోడుగా కోరుకుంటున్నా" అంటూ మొదలయ్యే లవ్ సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రియా శిబుల నిర్మాణం వహించారు.
Also Read: పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!
రిలీజ్ చేసిన ఈ లవ్ సాంగ్ కు మంచి స్పందన వస్తోంది. ఈ పాటకు సాహిత్యం రాజేశ్ గోపిశెట్టి అందించారు, శరత్ సంతోష్, రేష్మ శ్యామ్ గాయకులుగా ఉన్నారు. ఇందులో దుషారా విజయన్ హీరోయిన్ గా కనిపిస్తుంటే, ఎస్.జే. సూర్య, సూరజ్ వెంజరాముడు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి స్వరాలు జీవీ ప్రకాశ్ కుమార్ సమకూర్చారు.
Also Read: రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే?
సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా..
అయితే బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఇస్తుందని మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభిస్తోంది. తెలుగులో 'వీర ధీర సూరన్ -2' సినిమాను ఎన్వీఆర్ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2025 మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read: ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!
Also Read: ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..