Ravi Teja Mr. Bachchan Movie : మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన షోరీల్, మొదటి రెండు సింగిల్స్, టీజర్ చిత్రానికి మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. విడుదలైన రెండు సింగిల్స్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, ఈ మూడవ సింగిల్ కూడా అదే జోరును కొనసాగిస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పుడు మూవీ థర్డ్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్తో వచ్చారు.
రొమాంటిక్ మెలోడీ
సినిమా నుంచి మూడో సింగిల్ ‘జిక్కీ’ పేరుతో సాగనుందని తెలుపుతూ మేకర్స్ తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ – భాగ్యశ్రీ (Bhagyashri) ఫుల్ రొమాంటిక్ మోడ్ లో కనిపించారు. లేటెస్ట్ పోస్టర్ సూచించినట్లుగా, థర్డ్ సింగిల్ ‘జిక్కీ’ మెలోడియస్ రొమాంటిక్ నెంబర్ అని తెలుస్తుంది. ఈ పోస్టర్ కాస్త సాంగ్ పై అంచనాలు పెంచేసింది. ఆగస్ట్ 2న ఈ పాట విడుదల కానుంది.
#MrBachchan Third Single #Jikki on August 2nd :))) pic.twitter.com/oZkgVU9dTo
— Ravi Teja (@RaviTeja_offl) July 31, 2024
ఈ సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది. రవితేజ ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వితేజ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఆగస్టు 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.