Upendra in RAPO22: అందని వాడు.. అందరి వాడు మన సూర్య కుమార్.. 'ఉపేంద్ర' అస్సలు తగ్గేదేలే!

RAPO22లో కన్నడ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్‌లో ఆయన పాత్రను "సూర్య కుమార్"గా పరిచయం చేశారు మేకర్స్. మే 15న రామ్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ రివీల్ చేయనున్నారు.

New Update

Upendra in RAPO22: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై రూపొందుతున్న ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మహేష్ బాబు పి ఈ సినిమాకు మెగాఫోన్ పట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతం "RAPO22" అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ ఒకటి విడుదల చేసారు మేకర్స్, దీంతో ఈ సినిమా పై మరింత హైప్ ఏర్పడింది.

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) నటిస్తోంది. ప్రేమకథా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ పాత్ర పేరు  ‘మహాలక్ష్మి’ అని ఇప్పటికే విడుదలైన పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు. రామ్ పోతినేనికి ఇది ఓ కొత్త మేకోవర్‌గా ఉండబోతుందన్న టాక్ ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

ఆంధ్ర కింగ్ 'ఉపేంద్ర'

అయితే ఈ మూవీలో కన్నడ స్టార్ 'ఉపేంద్ర' ముఖ్య పాత్ర చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఉపేంద్ర పాత్ర పేరు "సూర్య కుమార్"గా తెలుస్తోంది. అయితే, ఉపేంద్ర పాత్రపై ఇంకా ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా మే 15న రామ్ బర్త్‌డే గిఫ్ట్ గా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు.

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

ఈ ప్రాజెక్ట్‌కి తమిళ సంగీత దర్శకులు వివేక్-మెర్విన్ లు పనిచేస్తున్నారు. లవ్ స్టోరీ మూవీ కావడంతో పాటలు, బీజీఎం ఈ సినిమాకి హైలైట్‌గా కానున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు మోగించుకొని సినిమాను 2025 దసరాకి థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!

"RAPO22" సినిమా రామ్ పోతినేని కెరీర్‌లో మరో మైలురాయిగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఉపేంద్ర పాత్ర సినిమాకు ఊహించని మలుపు ఇవ్వనుందని చిత్రబృందం చెబుతోంది. మే 15న టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల నేపథ్యంలో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై మరిన్ని అప్ డేట్స్ కోసం ఇంకొంత కాలం వేచి ఉండక తప్పదు.

Advertisment
తాజా కథనాలు