/rtv/media/media_files/2025/02/28/JfMe8tqT4qesXIZicZb9.jpg)
RAPO 22
RAPO 22: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) లేటెస్ట్ ప్రాజెక్ట్ 'ర్యాపో 22' గురించి అందరికి తెలిసిందే. ఇటీవల రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది ఈ మూవీ. గోదావరీ తీరంలో సినిమాకి సంబంధించి ముఖ్యమైన సీన్లను చిత్రికరించారు మూవీ టీం. ఈ చిత్రం డైరెక్టర్ పీ. మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతోంది. ఏపీలో వివిధ లొకేషన్లలో అత్యంత వేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీపై మేకర్స్ అంచనాలను పెంచేశారు.
Also Read: Ravi Prakash: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
రామ్ లవ్ సాంగ్..
హీరో రామ్ నటనలోనే కాదు, తెలుగు సినిమాల్లో క్రేజీ డాన్స్ మూమెంట్స్ చేస్తూ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే, రామ్ తాజాగా తనలో ఉన్న మరో స్పెషల్ టాలెంట్‌ను చూపించబోతున్నాడు. 'ర్యాపో 22'లో రామ్ ఒక లవ్ సాంగ్ ని స్వయంగా తానే రాసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ తో మూవీ సూపర్ సక్సెస్ సాధించాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. ఇంతకాలం తన నటనతో, డాన్సులతో మెప్పించిన రామ్ ఈ సారి తన పాటతో మెప్పించనున్నాడు.
Also Read: AP: ఓబులవారి పల్లె పీఎస్ ముగిసిన పోసాని విచారణ
'ర్యాపో 22' అనే వర్కింగ్ టైటిల్ ఉన్న ఈ మూవీ ఒరిజినల్ టైటిల్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, వివేక్. మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మూవీ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు మూవీ టీం.
Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!
Also Read: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్