/rtv/media/media_files/2025/04/28/YxfP7RItiS7br9YM20P2.jpg)
Vijay Deverakonda Kingdom
Vijay Deverakonda Kingdom: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్‌డమ్' పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా విజయ్ మూవీస్ అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి, అయినా ఈ సినిమాపై మాత్రం భారీ అంచనాలున్నాయి.
Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో
ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి 'జెర్సీ' చిత్రంతో గుర్తింపు పొందిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
Also Read: Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?
ఫస్ట్ సాంగ్ ప్రమో రెడీ - ఏప్రిల్ 30న విడుదల!
తాజా అప్ డేట్ ప్రకారం, ఏప్రిల్ 30న ఫస్ట్ సింగిల్ ప్రమో విడుదల చేయనున్నారు. అదే రోజు ఫుల్ సాంగ్ విడుదల తేదీ కూడా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అలాగే, సినిమా మే 30న థియేటర్లలో విడుదల కానుంది.
An @AnirudhOfficial Vibe 🎶🎹
— DreamZ Entertainment UK (@TeamDreamZE) April 28, 2025
From the World of #Kingdom ❤️
Promo on April 30th ❤️🔥@TheDeverakonda @gowtam19 #bhagyashriborse @dopjomon #GirishGangadharan @vamsi84 @SitharaEnts pic.twitter.com/jerrZaAiX1
భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) హీరోయిన్‌గా రెండు భాగాలుగా రూపొందుతున్నఈ చిత్రం ఎక్కువ శాతం శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.
Also Read: Samantha Temple బర్త్ డే రోజున సమంతకు ఏకంగా గుడి కట్టించిన అభిమాని.. నెట్టింట వీడియో వైరల్
ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. అద్భుతమైన మేకింగ్‌తో, పవర్‌ఫుల్ మ్యూజిక్, ఆకట్టుకునే కథతో ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్‌కు మరో మైలురాయి అవుతుందనే నమ్మకంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.