Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి విక్రయం చేస్తున్న ముఠా పట్టుబడింది. పుష్పా సినిమా సీన్లను తలదన్నేలా ఖతర్నాక్ ప్లాన్లు గంజాయి స్మగ్గ్లింగ్ కు ప్లాన్ వేశారు కేటుగాళ్లు. స్మగ్లర్లు ఏఓబీ నుంచి తమిళనాడుకు అంబులెన్స్ లో గంజాయిని తలరించేందుకు ప్లాన్ చేశారు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా సరికొత్త మార్గాల్లో స్మగ్లింగ్ కు తెరలేపారు. అయితే తమిళనాడుకు గంజాయి తరలిస్తుండగా మార్గమధ్యంలో కొత్తగూడెం వద్ద అంబులెన్స్ టైర్ పంక్చర్ అయ్యింది.
అంబులెన్స్ లో గంజాయి స్మగ్గ్లింగ్
టైర్ పంక్చర్ కావడంతో అంబులెన్స్ డ్రైవర్ స్థానికులను సాయం కోరడంతో టైర్ మార్చేందుకు అక్కడున్న యువత సహాయం చేసింది. ఈ క్రమంలో అంబులెన్స్ తీరు పై అనుమానం వచ్చిన ఓ యువకుడు బ్యాక్ డోర్ ఓపెన్ చేసి చూడగా.. గంజాయి ప్యాకెట్లు భారీగా బయటపడ్డాయి. వెంటనే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో యువకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి విచారణ చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Ganja: ఏపీలో రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్స్.. ఏకంగా డీఎస్పీపై అటాక్! – Rtvlive.com