/rtv/media/media_files/2025/05/16/NCLHfjD0dqRdZDgTg6oi.jpg)
Bhadradri Kothagudem transformer incident
TG News: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా జగన్నాథపురం గ్రామానికి చెందిన సోమిడి వంశీ అనే యువకుడు.. భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్ పని చేస్తూ.. అదే పట్టణంలో నివాసం ఉంటున్నాడు. భద్రాచలంలో వంశీ నివాసం ఉంటున్న గది సామ్రాట్ లాడ్జీని ఆనుకొని ఉంటుంది. అయితే ఈరోజు అదే వంశీ ప్రాణాలు పోవడానికి కారణం అవుతుందని ఎవరూ ఊహించలేదు!
Also Read: Hari Hara Veera Mallu Release Date: ఇట్స్ అఫీషియల్.. వీరమల్లు డేట్ ఫిక్స్ చేశాడు.. పవర్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా..
ప్రాణం తీసిన ట్రాన్స్ఫార్మర్
రోజు మాదిరిగానే వంశీ ఈరోజు ఉదయం కూడా గది బయటకు వచ్చి బ్రష్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి తీగల ద్వారా విద్యుత్ ఘాతం ఏర్పడి అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే సామ్రాట్ లాడ్జ్ కి సంబంధించిన విద్యుత్ తీగల గదికి ఆనుకొని ఉండడం వల్లే ఈ ఘటన జరిగినట్లు వంశీ స్నేహితులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వంశీ మృతికి విద్యుత్ శాఖ అధికారులు, సామ్రాట్ లాడ్జి నిర్వాహకులే కారణమని మండిపడుతున్నారు. ఫుట్ పాత్ ను ఆక్రమించి గృహనివాసాలకు ఆనుకుని ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ఎలా అనుమతిస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది పట్టణంలోని సామ్రాట్ లాడ్జి ఎదురుగా ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ ఘాతం ఏర్పడి యువకుడు మృత్యువాత
— RTV (@RTVnewsnetwork) May 16, 2025
మృతుడు ములుగుజిల్లా వాజేడుమండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన సోమిడి వంశీ(23)గా గుర్తింపు
సామ్రాట్ లాడ్జిని ఆనుకుని ఉన్న ఓగదిలో… pic.twitter.com/dfvr8DZoVE
Also Read: NTR-Neel: ఎన్టీఆర్- నీల్ ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్.. పాన్ ఇండియా బ్యూటీ ఎంట్రీతో భారీ హైప్
షాక్ తగిలిన తర్వాత వంశీ ఐదు నిమిషాల పాటు విద్యుత్ తీగలకు అతుక్కుపోయి ఉన్నాడు. శరీరంలోకి భారీగా విద్యుత్ ప్రసరణ జరగడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
bhadradri kothagudem latest news | bhadradri-kothagudem
Also Read : కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టులు హతం..!