London : లండన్ లో ఏపీ (Andhra Pradesh) కి చెందిన ఓ విద్యార్థి మృతి (Student Dead) చెందాడు. పల్నాడు (Palnadu) జిల్లా కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం ఈ నెల 2వ తేదీన లండన్ లో మరణించినట్లు అధికారులు సమాచారం అందించారు. లండన్ లోని పాకిస్థాన్ పోర్ట్ బీచ్ లో సాయిరాం మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని విద్యార్థి స్నేహితులు, అక్కడి అధికారులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు బోరున విలపిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తమ కుమారుడు బీచ్ లో మరణించినట్లు తెలిసిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. సాయిరాం విజయవాడలో బీటెక్ పూర్తి చేసి ఎంటెక్ చేసేందుకు మూడు సంవత్సరాల క్రితం లండన్ వెళ్లాడు. సాయిరాం ఈ నెల 2వ తేదీన బీచ్ కు వెళ్లి అక్కడ చనిపోయినట్లు సమాచారం. అయితే సాయిరాం మృతదేహాన్ని (Sai Ram Dead Body) భారత్ కు రప్పించేలా అధికారులు సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.