జనవరి 22 న అయోధ్యలో (Ayodhya) జరిగే రామ మందిర ప్రతిష్టాపన్ మహోత్సవం కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే రామభక్తుల హడావిడి మొదలైంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం గురించి ప్రధాని నరేంద్ర మోదీ(Modi) శనివారం దేశ ప్రజలకు ఓ విజ్ఙప్తి చేశారు. ” ప్రతి ఒక్కరికీ నా తరుఫున ఓ అభ్యర్థన ఉంది. జనవరి 22 న జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరూ ఎంతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. వారంతా కూడా స్వయంగా స్వామి వారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడానికి నగరానికి రావాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు.
అయితే అదే రోజు అయోధ్య పుణ్యభూమికి రావడానికి అందరికీ కుదరకపోవచ్చు. అలాంటి వారంతా కూడా జనవరి 22న అధికారిక కార్యక్రమం పూర్తయిన తరువాత రామభక్తులందరూ తమ వీలును చూసుకుని అయోధ్యకు రావాలి. అంతేకానీ హడావిడిగా రావొద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ” అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
రామ భక్తులు ఎవరూ కూడా స్వామి వారికి అసౌకర్యం కలిగించవద్దు, ఆయన వచ్చే వరకు వేచి ఉండాలి. మేము ఇప్పటికే 550 సంవత్సరాలు వేచి ఉన్నాం. దయచేసి మరికొన్ని రోజులు వేచి ఉండండి” అంటూ మోదీ అన్నారు. మోదీ శనివారం అయోధ్యలోని రైల్వే స్టేషన్, విమానాశ్రయాన్ని ప్రారంభించిన తరువాత ప్రసంగించారు. కొత్త గా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.
జనవరి 22న ప్రతి ఒక్కరి ఇళ్లలో దీపాలను వెలిగించాలని ఈ సందర్భంగా మోదీ కోరారు. అంతేకాకుండా జనవరి 14 నుంచి జనవరి 22 వరకు కూడా దేశ వ్యాప్తంగా తీర్థ యాత్రలు, దేవాలయాల్లో పరిశుభ్రత డ్రైవ్ లను ప్రారంభించాలని మోదీ ప్రజలను కోరారు. రాష్ట్రంలో రూ.15,700 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
Also read: వరంగల్ లో కరోనా కల్లోలం.. ఆరుగురు చిన్నారులకు కోవిడ్.. ఎంజీఎంలో ట్రీట్మెంట్!