Acharya Satyendra Das: అయోధ్య రామాలయం ప్రధాన పూజరికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

అయోధ్య రామాలయంలో ప్రధాన పూజారిగా ఉన్న ఆచార్య సత్యేంద్ర దాస్‌ (85) ఆదివారం అస్వస్థకు గుర్యయారు. దీంతో ఆయన్ని లక్నోలోని ఆస్పత్రిలో చేర్పించారు. బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

New Update
Ayodhya Ram Mandir head priest Acharya Satyendra Das

Ayodhya Ram Mandir head priest Acharya Satyendra Das

అయోధ్య రామాలయంలో ప్రధాన పూజారిగా ఉన్న ఆచార్య సత్యేంద్ర దాస్‌ (85) ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లక్నోలోని ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నారు. బీపీ, షుగర్‌తో బాధపడుతున్న సత్యేంద్ర దాస్‌ను ఆదివారం ఆస్పత్రిలో చేర్పించామని వెల్లడించారు. బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాము అందిస్తున్న వైద్యానికి ఆయన స్పందిస్తున్నట్లు పేర్కొన్నారు.     

Also Read: రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు

1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేతన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సత్యేంద్రదాస్‌ రామమందిరానికి పూజారిగా ఉన్నారు. 20 ఏళ్ల వయసులోనే నిర్వాణి అఖాఢాలో చేరిన ఆయన ఆధ్యాత్మిక దీక్షను తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, అలాగే బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో కూడా సత్యేంద్ర దాస్‌ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్న ఆయన.. తాజాగా ఆస్పత్రిలో చేరడం చర్చనీయాంశమవుతోంది.   

Also Read: ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాలను కలిపి విమర్శించిన రాహుల్ గాంధీ

ఇదిలాఉండగా అయోధ్య రామమందిరంపై గత ఐదు శతాబ్దాలుగా వివాదం కొనసాగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. చివరికి 2019లో సుప్రీంకోర్టు అయోధ్య రామమందిరానికి అనుకూలంగా సంచలన తీర్పునిచ్చింది. ఆ తర్వాత రామాలయ నిర్మాణం ప్రారంభమైంది. 2024లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆ ఏడాది జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.  

Also Read: ఎన్నికల కమిషనర్‌కు బీజేపీ ఆఫర్.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

Also Read: యూఎస్ఏఐడీ పై మండిపడుతున్న ట్రంప్ అండ్‌ మస్క్‌..ఎందుకో తెలుసా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు