/rtv/media/media_files/2025/02/02/PS8sI2k3UFM1OsuX9Xlm.webp)
Zakia Jafri
Zakia Jafri : 2002 గుజరాత్ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రి భార్య జకియా జాఫ్రి శనివారం చనిపోయారు. ఆమె తన భర్తతో పాటు 69 మంది మృతి వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ న్యాయపోరాటం చేశారు. దాదాపు 20 ఏండ్లకు పైగా ఆమె సుప్రీంకోర్టులో న్యాయంకోసం పోరాటం చేశారు.జాఫ్రి అహ్మదాబాద్‌లోని ఆమె సోదరి ఇంట్లో ఉంటున్నారు. శనివరం ఉదయం కుటుంబసభ్యులతో గడిపిన ఆమె కొంత సేపటికే అసౌకర్యానికి గురయ్యారు. దీంతో వెంటనే డాక్టర్‌ను పిలపించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా శనివారం 11.30 గంటల ప్రాంతంలో ఆమె మరణించారని కుమారుడు తన్వీర్ తెలిపారు.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?
అయోధ్య నుంచి కరసేవకులతో వస్తున్న రైలుకు అహ్మదాబాద్ లో గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో 59 మంది కరసేవకులు మృతిచెందారు. ఈ సంఘటన జరిగిన మరునాడు అహ్మదాబాద్ లోని గుల్బర్గా సొసైటీ కాలనీపై గుర్తుతెలియని వ్యక్తులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కనిపించిన వారిని కనిపించినట్టే ఊచకోత కోశారు. ఈ సంఘటనలో కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రితో పాటు 69 మంది చనిపోయారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఈ దాడుల తర్వాత గుజరాత్‌లో తీవ్ర అలజడి చలరేగింది. మత ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ జాఫ్రి భార్య జకియా జాఫ్రి న్యాయపోరాటానికి దిగారు. ఈ ఘటన అప్పట్లో దేశం మొత్తం ఆమెవైపు చూసేలా చేసింది.
Also Read: Tirumala Laddu: ఇంత దారుణమా! లడ్డూ వివాదం పై పవన్ హీరోయిన్ ఆగ్రహం
ఆ అల్లర్లకు నాటి ముఖ్యమంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు హిందూ సంస్థల నాయకులు కారకులని ఆమె ఆరోపించారు.వారందరిపై చార్జిషీటు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అల్లర్లను అదుపు చేయడంలో నాటి ప్రభుత్వం విఫలమైందని, అల్లర్లను అదుపు చేయడానికి చాలినంతగా పోలీసు బలగాలు లేనప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, సైన్యాన్ని మోహరించడంతో తాత్సారం చేసిందని ఆమె ఆరోపించారు.దానివల్లే వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పొవలసి వచ్చిందని వాదించారు.
Also Read: USA: కెనడా, మెక్సికో దిగుమతి సుంకాల ఉత్తర్వులపై సంతకం..ట్రంప్
అయితే ఆమె వాదనను నాటి గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. అయినప్పటికీ వెనుకాడకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించారు జకియా. ఆమె ఆరోపణలుపై విచారణకు సుప్రీం ఆదేశాలతో 2008 లో సిట్ ఏర్పాటు చేసింది. ఐదేండ్లపాటు విచారణ జరిపిన సిట్ 2012లో నివేదిక అందజేసింది. నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు కేసును మూసివేసింది. మోదీ మరో 62 మందికి క్లీన్‌చిట్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ జకియా తిరిగి మెట్రోపాలిజన్ కోర్టుకు ఆతర్వాత గుజరాత్ హైకోర్టు ను ఆశ్రయించారు.అయినా ఫలితం దక్కకపోవడంతో తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి జకియా జాఫ్రి వాదనల్లో పసలేదంటూ సుప్రీకోర్టు 2022 లో ఆమె ఆర్జీని కొట్టివేసింది. దాదాపు రెండు దశాబ్ధాల పాటు న్యాయపోరాటం చేసినప్పటికీ జకియాకు న్యాయం జరగకపోగా నాటి సంఘటనలో అసలుదోషులు ఎవరో తెలియకుండానే కేసు క్లోజ్ కావడం విచారకరం.