Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంపై శ్రీరామ జన్మభూమి ఆలయన నిర్మాణ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడను కట్టాలని నిర్ణయించారు. 18 నెలల్లో ఇది పూర్తవుతుందని భావిస్తున్నారు.

New Update
Ayodya Ram mandir

Ayodya Ram mandir

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంపై శ్రీరామ జన్మభూమి ఆలయన నిర్మాణ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడను కట్టాలని నిర్ణయించారు. 18 నెలల్లోనే ఇది పూర్తవుతుందని భావిస్తున్నారు. కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్ర సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు.  '' గోడను ఇంజనీర్స్ ఇండియా సంస్థ నిర్మిస్తుంది. దీని ఎత్తు, మందం, డిజైన్ వంటి వాటిని నిర్ణయించాం. మట్టి పరీక్షలు నిర్వహించాక పని ప్రారంభిస్తాం. 

Also Read: కంచగచ్చిబౌలిలో 400 ఎకరాలు ప్రభుత్వానివే.. సుప్రీంకోర్టుకు చెప్పిన తెలంగాణ సర్కార్

ఆలయ నిర్మాణ కమిటీ మీటింగ్ మూడోరోజున ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆలయ నిర్మాణంలో పురోగతి, భద్రతా ఏర్పాట్లు, విగ్రహాల ప్రతిష్ఠాపన, ఆలయ పరిసరాల్లో అభివృద్ధి లాంటి విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. మందిర నిర్మాణం మరో ఆరు నెలల్లోనే అన్ని విధాలుగా పూర్తి కానుంది. రామాలయ సముదాయంలో 10 ఎకరాల్లో ధ్యాన మందిరం నిర్మిస్తాం.  ప్రయాణికుల సౌకర్యం కోసం మరో పదెకరాల విస్తీర్ణంలో 62 స్టోరేజీ కౌంటర్లను, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయనున్నాం. సప్త మండల ఆలయాలకు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా జైపూర్ నుంచి ఆయా ఆలయాకు చేరుకున్నాయని'' నృపేంద్ర మిశ్ర తెలిపారు. 

Also Read: దారుణం.. ఏడాదిగా బాలికపై అత్యాచారం, 8 మంది అరెస్టు

ఇదిలాఉండగా అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక మెయిల్ ఐడీకి ఆదివారం రాత్రి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో భద్రతను మరింత పెంచారు. దీనిపై ఆలయ అధికారులు, పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు రామాలయంలో గర్భగుడి ప్రధాన శిఖరంపై భారీ కలశాన్ని సోమవారం ప్రతిష్ఠించారు. ఆలయ సముదాయంలో నిర్మి్స్తున్న 6 దేవాలయాల పైభాగంలో కలశాలను మరికొన్నిరోజుల్లోనే ఏర్పాటు చేయనున్నారు. 

Also Read: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

 telugu-news | rtv-news | ayodya-rama-mandhir | ayodya

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు