JIGRA Trailer: నేషనల్ అవార్డు విన్నర్ అలియా క్యూట్ బబ్లీ గర్ల్ నుంచి సీరియస్ యాక్షన్ వరకు అన్ని రకాల పాత్రల్లో తన సత్తా చాటుతూ బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. గతేడాది రొమాంటిక్ మూవీ ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ సూపర్ హిట్ అందుకున్న అలియా.. ఇప్పుడు ఫుల్ యాక్షన్ మోడ్ లో సిల్వర్ స్క్రీన్ పై తన పరాక్రమాన్ని చూపించబోతోంది.
జిగ్రా
మోనికా, ఓ మై గర్ల్ ఫ్రెండ్ చిత్రాల ఫేమ్ వాసన్ బాలా దర్శకత్వంలో అలియా నటిస్తున్న లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జిగ్రా’. ఈ చిత్రంలో వేదాంగ్ రైనా ఆలియా సోదరుడి పాత్రలో నటిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్, సోమెన్ మిశ్రా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
జిగ్రా ట్రైలర్
అక్కా తమ్ముడి ఎమోషన్ తో సాగిన జిగ్రా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తమ్ముడు కష్టాల్లో ఉన్నప్పుడు అతడి కోసం ఆయుధం పట్టిన సోదరి కథ జిగ్రా. ట్రైలర్ లో అమ్మను దేవుడు తీసుకెళ్లాడు.. తండ్రి ప్రాణాలు తీసుకున్నాడు.. బంధువులు ఆశ్రయం ఇచ్చారు.. కానీ దానికి మేము చాలా చెల్లించాము. అంటూ అలియా చెప్పిన డైలాగ్స్ ఎమోషనల్ గా అనిపించాయి. మరో వైపు జైల్లో ఉన్న తన తమ్ముడిని రక్షించుకోవాలని అలియా చేసే పోరాటం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొత్తానికి జిగ్రా ట్రైలర్ యాక్షన్, ఎమోషన్ తో నిండిపోయింది. ఇందులో అలియా పాత్ర ఫుల్ యాక్షన్ మోడ్ లో కొత్తగా కనిపించింది. టాలీవుడ్ నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Bhargavi Nilayam: ఏడాది తర్వాత ఓటీటీలో టోవినో థామస్ థ్రిల్లర్ ‘భార్గవి నిలయం’ – Rtvlive.com