/rtv/media/media_files/2025/03/07/5aSRuHgm99vQL7k0kV0b.jpg)
alia Bhat
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ అలియా- రణబీర్ కపూర్ తమ రెండవ బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరికి 'రహా' అనే ఆడబిడ్డ జన్మించగా.. మరో బిడ్డ కోసం ఆరాటపడుతున్నారు. ఈ విషయాన్నిఅలియా నేరుగా చెప్పకపోయినా.. ఓ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యల ద్వారా హింట్ ఇచ్చింది. ఇటీవలే జే శెట్టి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అలియా తన కూతురు 'రహా' అని ఎందుకు పెట్టారో వివరిస్తూ.. తన నెక్స్ట్ పుట్టబోయే బిడ్డకు కూడా ఒక పేరును నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ పేరు మాత్రం వెల్లడించలేదు.
Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్
ఆ పేరునే పెడతాం..
అయితే మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో ఆలియా - రణబీర్ అబ్బాయి పుడితే ఒక పేరు, అమ్మాయి పుడితే ఒక పేరును పెట్టాలని డిసైడ్ చేసుకున్నారట. అలా మొదటగా అమ్మాయి పుట్టడంతో 'రహా' అని పెట్టినట్లు తెలిపింది. అయితే తమకు ఎంతో నచ్చిన ఆ ఇంకో పేరును నెక్స్ట్ పుట్టబోయే బిడ్డకు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు హింట్ ఇచ్చింది అలియా. దీన్ని బట్టి అలియా- రణబీర్ రెండో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారని.. అందులోనూ మగపిల్లాడి కోసం ఎదురుచూస్తున్నారని అర్ధం అవుతోంది. అంతే కాదు అలియా 'రహా' అనే పేరును ఎవరు సజెస్ట్ చేశారో కూడా చెప్పింది. తన అత్తగారు నీతు కపూర్ 'రహా' పేరును సూచించినట్లు తెలిపింది.
నాలుగేళ్ళ డేటింగ్ తర్వాత 2022లో కుటుంబ సభ్యుల అంగీకారంతో అలియా- రణబీర్ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్ళైన సంవత్సరంలోనే వీరిద్దరికీ 'రహా' జన్మించింది. సినిమాలతో బిజీగా ఉన్నా ఆలియా- రణ్‌బీర్ తరచూ కూతురితో సమయాన్ని గడుపుతూ కనిపిస్తారు. రహా కూడా అప్పుడప్పుడు అమ్మానాన్నలతో ఎయిర్ పోర్ట్ లో ముద్దుముద్దుగా కనిపిస్తూ అభిమానులకు హాయ్ చెప్తూ సందడి చేస్తుంది.