గత కొన్నేళ్లుగా మన టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయాలు సాధిస్తూ, బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. దీంతో ఇతర భాషల నటీనటులు సైతం తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ చిత్రాల్లో చిన్న అవకాశం వచ్చినా, ఓకే చెప్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు స్టార్ హీరోయిన్లు తమ క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని భారీ పారితోషికాలు కూడా తీసుకుంటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒకరు. ఈమె తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. కానీ పది రోజుల షూటింగ్ కోసం ఏకంగా రూ.9 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందట. అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. Also Read : 'గుంటూరు కారం' రీ రిలీజ్.. అన్ని షోస్ హోస్ ఫుల్, రమణగాడా మజాకా! ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ కూతురుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన అలియా.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలి సినిమాతోనే ఘన విజయం సాధించిన ఆమె, వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆలియా తెలుగులో నటించిన ఏకైక చిత్రం 'RRR'. ఈ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో సీత పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, ఈ చిత్రానికి ఆమె కేవలం పది రోజుల పాటు మాత్రమే షూటింగ్‌లో పాల్గొందట. ఆ పదిరోజులకు ఏకంగా రూ.9 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. Also Read : న్యూ ఇయర్ కు క్యూ కడుతున్న రీరిలీజ్ సినిమాలు.. లిస్ట్ ఇదే! సౌత్ లో ఓ హీరోయిన్ కు నిర్మాతలు ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇవ్వడం అదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా ఆలియా భట్ 'RRR' తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో వరుస అవకాశాలతో తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. రీసెంట్ గా హిందీలో ఆమె చేసిన 'జిగ్రా' మూవీకి మంచి రెస్పాన్న్ వచ్చింది.