Mohan Lal: మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటుల పరిస్థితులపై జస్టిస్ హేమా కమిటీ సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. పలువురు సీనియర్ నటులు, నిర్మాతలు పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపుతోంది. AMMA (Association of Malayalam Movie Artists) కమిటీ జనరల్ సెక్రెటరీ సిద్ధిఖీతో పాటు కమిటీలోని కొందరి సభ్యులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ.. AMMA ప్రెసిండెంట్ మోహన్ లాల్ తో సహా కమిటీ సభ్యులందరూ రాజీనామా చేశారు.
దయచేసి పరిశ్రమను నాశనం చేయకండి
అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ లాల్ మలయాళ చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల పై స్పందించారు. “AMMA అనేది ఒక ట్రేడ్ యూనియన్ కాదు.. ఇది ఒక కుటుంబం లాంటిదని. AMMA అసోసియేషన్ పై లైంగిక ఆరోపణలు రావడం దురదృష్టకరం అని తెలిపారు. ‘AMMA’ కోసం చాలా మంచి పనులు చేశాము. ఇతర పరిశ్రమల కంటే మన ఇండస్ట్రీ చాలా బెటర్ గా ఉందని. ఈ వ్యవహారంలో కేవలం ‘అమ్మ’ ను లక్ష్యంగా చేసుకోవద్దని మీడియాతో పాటు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.
హేమా కమిటీ రిపోర్టును స్వాగతిస్తున్నాము. ఆ నివేదికను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైనదే. ప్రస్తుతం కమిషన్ నివేదిక పై విచారణ జరుగుతోంది. తీర్పు వచ్చే వరకు ఎదురుచూద్దాము. అప్పటివరకు దయచేసి పరిశ్రమను నాశనం చేయకండి అని తెలిపారు. మలయాళ చిత్ర పరిశ్రమ చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ. ఇందులో చాలా మంది ఉన్నారు.. అందరినీ నిందించలేము. తీర్పు వచ్చే వరకు వేచి ఉండండి. దోషులకు శిక్ష తప్పదు అని స్పష్టం చేశారు. ”
Also Read: Siddharth – Aditi: మా పెళ్లి కూడా అక్కడే.. ఆ ఆలయంతో ఎంతో అనుబంధం ఉంది..! – Rtvlive.com