L2E Empuraan: మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'L2: ఎంపురాన్'. ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో.. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హై-ఎండ్ టెక్నికల్ ఎగ్జిక్యూషన్, స్టార్ తారాగణం, పవర్ ఫుల్ సంభాషణలతో ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రం మార్చి 27న థియేటర్స్ లో విడుదల కానుంది.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
I made sure that every penny for #L2E is spent on making . #Mohanlal sir didn't take a single rupee as Remuneration for #Empuraan. This is not the film where 80 Crs goes for salary & 20 Crs for making
— CINE EXPLORERS (@CINE_EXPLORERS) March 21, 2025
pic.twitter.com/6vn8XDAY7B
ఒక్క రూపాయి కూడా..
ఇదిలాఉంటే.. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే పింక్ విల్లా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు పృథ్వీరాజ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. స్టార్ హీరో మోహన్‌లాల్ 'L2: ఎంపురాన్' చేయడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపారు. దానివల్లే తాము ఈ చిత్రాన్ని నిర్మించగలిగినట్లు చెప్పారు. 80 కోట్లు రెమ్యూనరేషన్స్ కి ఖర్చు చేసి.. కేవలం 20కోట్లతో పూర్తిచేసే సినిమా కాదు ఇది. సాంకేతిక నిపుణులు, నటీనటులందరికీ మేము ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నామని తెలుసు. దానికి అనుగుణంగానే వారు సహకరించారాని తెలిపారు పృథ్వీరాజ్. ఈ చిత్రాన్ని టర్కీ, ఫ్రాన్స్, లండన్, యెమెన్, సెనెగల్, ఇరాక్, చైనాతో సహా అనేక అంతర్జాతీయ ప్రదేశాలలో షూట్ చేశారు. ఇందులో టోవినో థామస్, అభిమన్యు సింగ్, ఇంద్రజిత్ సుకుమారన్ మరియు మంజు వారియర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
telugu-news | L2E Empuraan | actor-mohan-lal | prithviraj-sukumaran
ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి