Mohanlal: మమ్ముట్టి కోసం పూజలు చేసిన మోహన్‌లాల్.. ఏం జరిగిందంటే?

మలయాళ నటుడు మోహన్‌లాల్‌ శబరిమలను సందర్శించాడు. అక్కడ తన స్నేహితుడు మమ్ముట్టిపై ఉన్న అభిమానాన్ని మరోసారి బయటపెట్టాడు. తన కుటుంబసభ్యులతోపాటు మమ్ముట్టి కోసం ప్రత్యేక పూజలు చేశాడు. కాగా ఇటీవల మమ్ముట్టి అనారోగ్యంతో ఉన్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

New Update
Mohanlal performs special pujas in Mammootty's name at Sabarimala

Mohanlal performs special pujas in Mammootty' name at Sabarimala

సినీ ఇండస్ట్రీలో ఉన్న నటీ నటులు ఎంతో స్నేహబంధంతో ఉంటారు. తమ ఇంట్లో వారిలానే కలిసి మెలిసి ఉంటారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు ఉంటారు. అందులో మలయాళ స్టార్ హీరోస్ అయిన మోహన్‌లాల్, మమ్ముట్టి ఒకరు. వీరి స్నేహబంధం ఎన్నో ఏళ్లనాటిది. ఇప్పటికీ అలానే చెక్కు చెదరకుండా ఉంది. 

శబరిమలలో మోహన్‌లాల్

వీరిద్దరూ ఎన్నోసార్లు ఒకరిపై ఒకరు తమ ఆత్మీయ స్నేహబంధాన్ని చూపించుకున్నారు. తాజాగా మరోసారి వీరిద్ధరి మధ్య స్నేహం ఎంతటి గొప్పదో మరోసారి రుజువు అయింది. మమ్ముట్టి మీద ఉన్న అభిమానాన్ని మోహన్‌లాల్ మరోసారి చూపించారు. అత్యంత ప్రతిష్టాత్మక శబరిమల ఆలయంలో మమ్ముట్టి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించాడు. 

Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’. ఈ సినిమా మార్చి 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తన సినిమా విడుదలను పురస్కరించుకుని మోహన్‌లాల్ మంగళవారం శబరిమల వెళ్లారు. 

ప్రత్యేక పూజలు

అక్కడ తన కుటుంబ సభ్యులతోపాటు ఆప్త మిత్రుడు మమ్ముట్టి పేరు మీద స్వామి వారికి పూజలు చేశారు. ఆ పూజ సమయంలో అతడు మమ్ముట్టి అసలు పేరును చెప్పినట్లు తెలుస్తోంది. మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి అని మోహన్‌లాల్ చదివించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా మమ్ముట్టి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలు జోరుగా సాగాయి. ఆ వార్తలపై స్పందించిన మమ్ముట్టి టీం.. వాటిని కొట్టిపారేసింది. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. 

Also Read : నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు