/rtv/media/media_files/2025/02/21/OuhFw0AQWt5b5jFkkUFF.jpg)
drishyam 3
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం'. రెండు పార్టులుగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి పార్ట్ 3 అనౌన్స్ చేశారు మేకర్స్. గతం ఎప్పుడూ మౌనంగా ఉండదు. 'దృశ్యం 3' ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది అంటూ మోహన్ లాల్ ట్వీట్ చేశారు.
ఇది కూడా చూడండి:HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!
The Past Never Stays Silent
— Mohanlal (@Mohanlal) February 20, 2025
Drishyam 3 Confirmed!#Drishyam3pic.twitter.com/xZ8R7N82un
Also Read : డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృతి
150 రోజులకు పైగా థియేటర్లలో
2013లో విడుదలైన 'దృశ్యం పార్ట్ 1' 150 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శితమైంది. దశాబ్దం పాటు అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రాల జాబితాలో టాప్ 10లో నిలిచింది. అంతేకాదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 125 రోజుల పాటు ప్రదర్శితమై అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత 2021లో వచ్చిన పార్ట్ 2 కూడా అంతే విజయాన్ని అందుకుంది. ఇందులో మీనా అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిక్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, నీరజ్ మాధవ్ కీలక పాత్రలు పోషించారు.
Also Read : ఫుల్గా తాగి.. నడిరోడ్డుపై భార్యతో ఎస్సై అసభ్యంగా.. అక్కడ చేతులు వేస్తూ..
మొదటగా మలయాళంలో విడుదలైన ఈ చిత్రాన్ని భారతదేశంలోని నాలుగు ప్రాంతీయ భాషల్లో రీమేక్ చేశారు. అయితే రీమేక్ చేసిన అన్ని భాషల్లోని సూపర్ హిట్ అయ్యింది. కన్నడలో ‘దృశ్యం’ (2014), తెలుగులో ‘దృశ్యం’ (2014), తమిళంలో ‘పాపనాశం’ (2015) , హిందీలో ‘దృశ్యం’ పేర్లతో విడుదల చేశారు. ఇండియాలోనే కాదు అంతర్జాతీయ భాషల్లో 'దృశ్యం' చిత్రాన్ని రీమేక్ చేశారు. సిన్హాలా భాషలో ‘ధర్మయుద్ధం' గా చైనీస్ భాషలో ‘షీప్ వితౌట్ ఎ షెపర్డ్’గా తీశారు. కొరియన్ భాషలలో కూడా రీమేక్‌లు ప్రకటించారు. ఇన్ని భాషల్లో రీమేక్ చేసిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.
ఇది కూడా చూడండి:Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?