Mohan Lal: 'పేట్రియాట్' టైటిల్ తో మమ్ముట్టి - మోహన్ లాల్!

మహేష్ నారాయణన్ దర్శకత్వంలో మమ్ముట్టి- మోహన్ లాల్ కలిసి నటిస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాకు 'పేట్రియాట్' అనే పేరు పెట్టినట్లు మోహన్ లాల్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

New Update

Mohan Lal: మలయాళ స్టార్స్ మమ్ముట్టి- మోహన్ లాల్ కలిసి మహేష్ నారాయణన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 16 సంవత్సరాల తర్వాత మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటిస్తుండటం సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది.  దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో మోహన్ లాల్ అనుకోకుండా ఈ సినిమా టైటిల్ రివీల్ చేశారు. 

Also Read: Priya Prakash Varrier: గోల్డెన్ కలర్ బ్లౌజ్‌లో ప్రియా ప్రకాశ్ ఎద అందాలు.. కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తుందిగా!

 'పేట్రియాట్' టైటిల్ 

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం శ్రీలంక వెళ్లిన మోహన్ లాల్.. అక్కడి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో మోహన్ లాల్ మాట్లాడుతూ..  "శ్రీలంకకు  ఇది నా రెండో పర్యటన..  గతంలో కూడా ఒక షెడ్యూల్ జరిగింది. మేము ఒక పెద్ద సినిమా చేస్తున్నాం. ఇందులో మమ్ముట్టి, ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ  సినిమా పేరు 'పేట్రియాట్'  అంటూ పొరపాటున మూవీ టైటిల్ రివీల్ చేశారు. దీంతో ఈ సినిమా దేశభక్తి నేపథ్యంలో ఉండొచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. 

ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా

ఈ సినిమా షూటింగ్ శ్రీలంక, భారతదేశం, అజర్‌బైజాన్, యునైటెడ్ కింగ్‌డమ్ (UK),  మిడిల్ ఈస్ట్ వంటి పలు దేశాల్లో జరుగుతోంది. ప్రస్తుతం నటీనటులు  శ్రీలంకలో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆరోగ్య కారణాల వల్ల షూటింగ్ నుంచి విరామం తీసుకున్న మమ్ముట్టి  త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.

Also Read: Chiranjeevi: శేఖర్ కమ్ముల చేయి వేయగానే చిరంజీవి ఎలా చేశారో చూడండి! వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు