Mohanlal: ఆరుపదుల వయసులోనూ వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నారు మలయాళ స్టార్ మోహన్ లాల్. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి.. కొద్దికాలంలోనే తన నటన నైపుణ్యంతో సౌత్ ఇండస్ట్రీలోనే అగ్రకథానాయకుడిగా ఎదిగారు. 45 ఏళ్ళ సినీ కెరీర్ లో.. 2 నేషనల్ అవార్డులు, 5 కేరళ రాష్ట్ర అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. దాదాపు 340కి పైగా సినిమాలతో అలరించిన ఈ లెజెండ్రీ నటుడు నేడు 65వ వసంతంలోకి అడుగుపెట్టారు.
జీవిత చరిత్ర పై బుక్
అయితే తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన జీవిత చరిత్రను పుస్తకరూపంలో అందించనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 'ముఖరాగం' పేరుతో ఈ పుస్తకం రానున్నట్లు తెలిపారు. దాదాపు వెయ్యి పేజీలతో కూడిన ఈ బుక్ ను డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో వీడియోను పంచుకున్నారు.
#മുഖരാഗം#Mukharagam pic.twitter.com/llaGtckz5u
— Mohanlal (@Mohanlal) May 21, 2025
మోహన్ లాల్ మాట్లాడుతూ.. ''నా పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నాను. నా జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలను రచయిత భాను ప్రకాష్ పుస్తకం రూపంలో రాశారు. ఈ పుస్తకం ముఖరాగం పేరుతో రానుంది. మలయాళంలో నాకు ఎంతో ఇష్టమైన రచయిత వాసుదేవన్ నాయర్ దీనికి ముందు మాట రాశారు. ఈ పుస్తకంలో గత 47 ఏళ్ల నా సినీ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు, అంశాలను గురించి వివరించారు. ఎంతో మంది నా జీవిత చరిత్ర పుస్తకం రూపంలో రావాలని కలలుకన్నారు. ఇప్పుడు అవి నిజమవుతున్నాయి అంటూ వీడియో షేర్ చేశారు.
ఇదిలా ఉంటే నేడు మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా 'కన్నప్ప' నుంచి ఆయన గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేసింది టీమ్. ఇందులో ఆయన 'కిరాత' పాత్రలో కనిపించనున్నారు. కన్నప్ప చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
telugu-news | cinema-news | telugu-cinema-news | actor-mohan-lal | HBD Mohan lal | Mohanlal's biography book