Stock Market Today: కొత్త నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లు తమ పతనాన్ని కొనసాగిస్తున్నాయి. బేర్ పంజా మార్కెట్లను భారీ నష్టాల్లోకి లాగేస్తోంది. ఈ తరుణంలో ప్రధానంగా దేశీయ ఈక్విటీ ఇన్వెస్టర్లు ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నారు. ప్రీ-ఓపెన్ సెషన్ నుంచే మార్కెట్లు ఒత్తికి లోనయ్యాయి. ఈ సెషన్స్‌లోనే సెన్సెక్స్ (Sensex) 180 పడిపోగా, నిఫ్టీ (Nifty) 0.30 శాతం నష్టాలతో ఉంది. దీంతో సెన్సెక్స్ 450 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 125 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 465 పాయింట్ల నష్టంతో 65,047 దగ్గర, నిష్టీ 131 పాయింట్ల నష్టపోయి 19,397 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 83.24 దగ్గర మొదలైంది.
నిన్న మంగళవారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతో రోజును ముగించాయి. దాంతో పాటూ మంగళవారం అమెరికా, ఐరోపా మార్కెట్లు కూడా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అయితే అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నా 2023-24 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 6.3 శాతంతో కొనసాగిస్తోందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.
సెన్సెక్స్ 30 సూచీల్లో నెస్ట్లే ఇండియా, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉండగా మారుతీ, ఎన్టీపీసీ, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫిన్ సర్వ్, టాటాస్టీల్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, జెఎస్‌డబ్య్లూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.ప్రారంభ ట్రేడ్ లో దాదాపు అన్ని కంపెనీలు పతనావస్థలోనే ఉన్నాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్ లో 27 రెడ్ జోన్ లో ఉన్నాయి. నెస్ల్టే షేర్లు మాత్రమే 3 శాతానికి పెరిగాయి. ఎన్టీపీసీ 3.25, యాక్సిస్ బ్యంఆక్ 2 శాతం క్షీణించాయి. మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, జెఎస్‌డబ్య్లూ స్టీల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ షేర్లు 1.50 శాతానికి పైగా నష్టాల్లో ఉన్నాయి.
Also read:ఏపీ హైకోర్టులో చంద్రబాబు, నారా లోకేష్ పిటిషన్ల విచారణ
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు