Koneru Humpy: ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ విజేతగా కోనేరు హంపి!
తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన ఘనత సాధించింది. ప్రపంచ ర్యాపిడ్ ,బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్ గా కోనేరు హంపి విజయం సాధించింది.
తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన ఘనత సాధించింది. ప్రపంచ ర్యాపిడ్ ,బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్ గా కోనేరు హంపి విజయం సాధించింది.
బాక్సింగ్ డే టెస్ట్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి సెంచరీ చేశాడు. ఈ అద్భుత సెంచురీకి బీసీసీఐ అతనికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. అతని తల్లిదండ్రులను ఆస్ట్రేలియా తీసుకువచ్చి నితీశ్‌ను సంతోషంలో మునిగిపోయేలా చేసింది.
శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్స్ పదేళ్ల రికార్డ్ బద్ధలు కొట్టారు. మిచెల్- బ్రేస్‌వెల్ జోడీ 6వ వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మెకల్లమ్-ల్యూక్ రోంచి (85) రికార్డును చెరిపేశారు. ఈ మ్యాచ్‌లో కివీస్ 8పరుగుల తేడాతో గెలిచింది.
ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా ప్రకటించింది. నితిష్‌కు ప్రోత్సాహంగా రూ.25 లక్షలు అందిస్తామని ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు.
ఆస్ట్రేలియాలో అదరగొడుతున్న నితీష్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు మాజీ ఛీప్ సెలెక్టర్ MSK ప్రసాద్. అండర్-14 అకాడమీలో నితీష్‌కు ఫ్రీ ఫుడ్, బట్టలు, వసతి కల్పించాలని తన తండ్రి అడిగాడని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కుర్రాడిని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.
రిషబ్ పంత్‌ను సునీల్ గావస్కర్ పొట్టుపొట్టు తిట్టారు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ర్యాంప్ షాట్ ఆడి ఔట్ కావడంతో 'స్టుపిడ్ షాట్. స్టుపిడ్ సెలక్షన్. భారత డ్రెస్సింగ్ రూమ్ వెళ్లొద్దు. ఇది టీ20 క్రికెట్ అనుకుంటున్నావా' అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి మెల్బోర్న్లో అదరగొట్టాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో తొలి సెంచరీ చేశాడు. అతడి బయోగ్రఫీ కోసం క్రికెట్ ప్రియులు తెగ వెతికేస్తున్నారు. కొడుకు కెరీర్ కోసం తండ్రి తన ప్రభుత్వ ఉద్యోగం వదిలేసిన ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చదవండి.
ఆసీస్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో నితీష్ రెడ్డి సెంచరీ కొట్టాడు. టెస్టు కెరీర్లో తొలి శతకాన్ని సాధించాడు. ఆసీస్ గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. గత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (87) రికార్డును బద్దలు కొట్టాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ నితీశ్ రెడ్డి చెలరేగాడు. 50 పరుగులు చేసిన వెంటనే ఆస్ట్రేలియా అభిమానుల ముందు పుష్ప స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. దీంతో భారత అభిమానుల సందడితో స్టేడియం మొత్తం దద్దరిల్లింది.