Nz Vs Sl: న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. న్యూజిలాండ్ లోని బే ఓవల్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 8పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్ల దెబ్బకు 10 ఏళ్ల రికార్డ్ బద్ధలైంది. ఈ మేరకు డారిల్ మిచెల్- మైఖేల్ బ్రేస్‌వెల్ 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 65/5తో కష్టాల్లో ఉన్న కివీస్‌ను 172 పరుగులతో గట్టెక్కించి ఈ ఘనత సాధించారు.
ఆరో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం..
ఈ క్రమంలో పదేళ్ల క్రితం బ్రెండన్ మెకల్లమ్-ల్యూక్ రోంచీల (85) పరుగుల భాగస్వామ్యాన్ని ఈ ద్వయం అధిగమించింది. ఆరో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్య నెలకొల్పిన జోడీ.. కివీస్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక భాగస్వామ్యాన్ని అందించిన మొదటి జంటగా నిలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసి కివీస్.. 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. మిచెల్ 62, బ్రేస్ వెల్ 59 పరుగులు చేశారు. శ్రీలంక బౌలింగ్ దాడికి న్యూజిలాండ్ తక్కువ స్కోరుకే తమ టాప్ ఆర్డర్‌ను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే ఈ జోడి కీలక భాగస్వామ్యం నెలకొల్పగా కివీస్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి ఓటమిపాలైంది.
ఇది కూడా చదవండి: Nitish reddy: బాక్సింగ్ టెస్ట్ హీరో.. నితీష్‌కి ACA భారీ నజరానా!
6వ వికెట్‌కు టీ20ల్లో న్యూజిలాండ్‌కు అత్యధిక భాగస్వామ్యం:
105 (58 బాల్స్) - డారిల్ మిచెల్- మైఖేల్ బ్రేస్‌వెల్ (vs SL) - మౌంట్ మౌంగనుయి 2024
85* (43 బాల్స్) - బ్రెండన్ మెకల్లమ్-ల్యూక్ రోంచి (vs WI) - ఆక్లాండ్ 2014
73 (32 బాల్స్) - జాకబ్ ఓరమ్-క్రెయిగ్ మెక్‌మిలన్ (vs Ind ) - జోహన్నెస్‌బర్గ్ 2007
68 (43 బాల్స్) - రాస్ టేలర్-ల్యూక్ రోంచి (vs WI) - వెల్లింగ్టన్ 2014