Nitesh Kumar reddy: ఆసీస్ గడ్డపై తెలుగు కుర్రాడి ప్రభంజనం.. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు!

ఆసీస్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో నితీష్ రెడ్డి సెంచరీ కొట్టాడు. టెస్టు కెరీర్‌లో తొలి శతకాన్ని సాధించాడు. ఆసీస్ గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. గత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (87) రికార్డును బద్దలు కొట్టాడు.

New Update
Nitish Kumar reddy

IND vs AUS Nitish Kumar reddy

మెల్‌బోర్న్ వేదికగా జరుగుతోన్న నాలుగో (బాక్సింగ్ డే) టెస్ట్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తనదైన శైలిలో అదరగొట్టేస్తున్నాడు. ఈ టెస్టులో టీమిండియా జట్టును ఫాల్ ఆన్‌ నుంచి తప్పించి ఆపద్భాంధవుడయ్యాడు. అనంతరం అంతర్జాతయ టెస్టుల్లో తొలి సెంచరీని నమోదు చేసి రికార్డు సృష్టించాడు. 

Also Read :  ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు!

ALSO READ: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి...

తొలి సెంచరీ

తన టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నితీశ్ కుమార్ రెడ్డి నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తొలి బంతి నుంచి నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. 

నితీశ్ తండ్రి భావోద్వేగం

ఇదంతా ఒకెత్తయితే నితీశ్ తండ్రి కూడా స్టేడియంలో కొడుకు ఆటను చూసి మురిసిపోయాడు. నితీశ్ ఎప్పుడైతే సెంచరీ చేశాడో భావోద్వేగానికి గురయ్యాడు. కళ్లంట ఆనంద భాష్పాలు చిందించాడు. అందుకు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Also Read :  ట్రయాంగిల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. వివాహేతర సంబంధమే!

Also Read : అల్లు అర్జున్ పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం.. వైరల్ అవుతున్న వీడియో!

అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్

ఇదిలా ఉంటే గత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (87) రికార్డును నితీశ్ బద్దలు కొట్టాడు. ఇక నితీశ్‌ రెడ్డితో పాటు క్రీజ్‌ వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు. సుందర్ (50) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 9వ స్థానంలో వచ్చిన సుందర్ హాఫ్ సెంచరీ సాధించాడు. దాదాపు 146 బంతుల్లో అర్థశతకం చేశాడు. సుందర్‌ కెరీర్‌లో ఈ హాఫ్ సెంచరీ నాల్గవది. అనంతరం నాథన్ లైయన్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియా మరో 116 పరుగులు వెనుకబడి ఉంది. 

Advertisment
తాజా కథనాలు