మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి పేరు మారు మోగుతోంది. తన టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. తొలి హాఫ్ సెంచరీకి పుష్ప స్టైల్లో చేసిన రచ్చ నెట్టింట వైరల్ అయింది. అనంతరం సెంచరీతో చెలరేగి దుమ్ము దులిపేశాడు. ఇలా ప్రస్తుతం నితీష్ రెడ్డి పేరు మారుమోగుతోంది. దీంతో నితీష్ రెడ్డి ఎవరు?, అతడి ఏ రాష్ట్రం? నితీష్ ఊరేంటి? అని అంతా తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఇప్పుడు అతడి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ALSO READ: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి... నితీష్ కుమార్ రెడ్డిది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నం. వారిది సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం. క్రికెట్ అంటే నితీష్ రెడ్డికి చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. స్కూల్ టైంలో ఎన్నో సార్లు క్లాసులు ఎగ్గొట్టి క్రికెట్ మ్యాచ్‌లకు వెళ్లేవాడట. నితీష్ రెడ్డి తండ్రి పేరు ముత్యాల రెడ్డి. ఆయన హిందుస్థాన్ జింక్‌లో పనిచేసేవాడు. నితీష్ రెడ్డి తన 5ఏళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. హిందూస్థాన్ జింక్ గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతూ.. తన స్టైలిష్ బ్యాటింగ్‌తో అందరి చేత ప్రశంసలు అందుకునేవాడు. ఎంతో మందిని సైతం తన బ్యాటింగ్‌తో ఆశ్చర్యపరిచేవాడట. Also Read : ట్రయాంగిల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. వివాహేతర సంబంధమే! దీంతో తన తండ్రి పోత్సాహంతో క్రికెట్‌నే కెరియర్‌గా ఎంచుకున్నాడు. అయితే నితీష్ రెడ్డి వాళ్ల నాన్న ముత్యాల రెడ్డిని ఉదయ్ పూర్‌కి ట్రాన్సఫర్ చేశారు. దీంతో తన కొడుకు నితీష్ కెరియర్ మధ్యలోనే ఆగిపోతుందని భావించిన ఆ తండ్రి తన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. నిజానికి ఒక మధ్యతరగతి తండ్రి కొడుకు కోసం ఇంత త్యాగం చేస్తాడా? అని ఎవ్వరూ అనుకోరు. కానీ కొడుకు నితీష్ కెరియర్ కోసం అతడి తండ్రి చేసిన త్యాగం చూస్తే మాత్రం ప్రతీ ఒక్కరికీ కన్నీళ్లు ఆగవు. Also Read : అల్లు అర్జున్ పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం.. వైరల్ అవుతున్న వీడియో! ఎంతో మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్లు అలాంటి సమయంలో కొడుకు కోసం ఇలాంటి త్యాగం చేయడం చిన్న విషయం కాదు. తన కొడుకు ఎప్పటికైనా ఉన్నత స్థాయికి ఎదుగుతాడని గట్టిగా నమ్మడంతో ఆ తండ్రి తన జీవితాన్నే పక్కన పెట్టేశాడు. ఈ నిర్ణయం తీసుకున్నాక నితీష్ తండ్రిపై తమ బంధువులు చాలా కోప్పడ్డారట. కానీ ముత్యాల రెడ్డి వాటన్నింటినీ ఎక్కడా పట్టించుకోకుండా తన కొడుకును ఎలాగైనా సరే మంచి స్థాయిలో తీసుకెళ్లాలని కష్టపడుతూ వచ్చాడు. ఈ విషయాలన్నీ నితీష్ రెడ్డి గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. కెరియర్ మొదట్లో విశాఖపట్నం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన క్యాంపులకు హాజరైన నితీష్ రెడ్డి.. మాజీ ఛీప్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సహాయంతో కడపలో ఎస్సీఏ అకాడమీలో చేరి మరింత రాటుదేలాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో ఓపెనింగ్ చేసే నితీష్ రెడ్డి మీడియా ఫేసర్‌గా సత్తా చాటాడు. ఇండియన్ ఆల్ రౌండర్ అవ్వాలన్నదే తన ఆశయం. Also Read : ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు! అందుకే 19 బి టీం కి కూడా కెప్టెన్సీ వహించాడు. 2019-20 రంజి సీజన్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నితీష్ ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లో 1 సెంచరీ 1 హాఫ్ సెంచరీతో మూడు వందల 66 పరుగులు చేశాడు. ఇక తన లైఫ్ గోల్ కూడా ఇండియన్ టీంకి ఆడాలి. ఎంతగానో ఎదురుచూశాడు. అయితే నితీశ్ రెడ్డి పర్ఫార్మెన్స్ గమనించిన సన్రైజర్స్ ఐపీఎల్ ఆక్షన్‌లో కేవలం రూ.20 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ లాస్ట్ సీజన్‌లో ఒక్కసారి కూడా తనకు ఆడే అవకాశం రాలేదు. కానీ నమ్మకం వదులుకోకుండా ఐపీఎల్ లో తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. ఐపీఎల్ లో దుమ్ముదులిపేశాడు. అక్కడ నుంచి నితీష్ పై అందరిలోనూ ఒక మంచి అభిప్రాయం వచ్చేసింది. ఇదే ఐపీఎల్‌లో స్టార్ ప్లేయర్ రబాడా బౌలింగ్‌ను సైతం ఉతికి ఆరేసాడు. ఇలా ఐపీఎల్‌లో చేరి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో తన మార్క్ చూపిస్తున్నాడు. అప్పట్లో ఒక ప్లాస్టిక్ బాల్‌తో తన ఆటను ప్రారంభించిన నితీష్ రెడ్డి.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ స్థాయి ఆటగాళ్లను గడగడలాడిస్తున్నాడనే చెప్పాలి.