Koneru Humpy: ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్ విజేతగా కోనేరు హంపి!

తెలుగు గ్రాండ్‌ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన ఘనత సాధించింది. ప్రపంచ ర్యాపిడ్‌ ,బ్లిట్జ్‌ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ లో భాగంగా ర్యాపిడ్‌ ఛాంపియన్‌ గా కోనేరు హంపి విజయం సాధించింది.

New Update
Humpy

humpy

Koneru Humpy: ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా తెలుగు గ్రాండ్‌ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన విజయం సాధించింది. న్యూయార్క్‌ వేదికగా డిసెంబర్ 29 జరిగిన పోరులో కోనేరు హంపి రికార్డు సృష్టించింది. ఇండోనేషియాకు చెందిన ఐరీన్‌ సుకందర్‌ను ఓడించి ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌‌ను సొంతం చేసుకుంది. టోర్నీలో 11 పాయింట్లలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లి విజయం సాధించింది. 

Also Read: Telangana: తండ్రి లేకపోయినా ఫర్వలేదు..మైనర్‌ కి పాస్‌పోర్టు ఇవ్వొచ్చు!

అయితే హంపికి ఇది తొలి విజయం కాదు. గతంలో అంటే 2019లో జార్జియా వేదికగా జరిగిన ఇదే ఈవెంట్లో ఛాంపియన్‌గా నిలిచింది. తద్వారా చైనాకు చెందిన గ్రాండ్ మాస్టర్  వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు టైటిల్‌ను గెలుచుకున్న రెండవ భారత క్రీడాకారిణిగా కోనేరు హంపి నిలిచింది. హంపి తర్వాత మరో తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో ప్లేస్‌లో నిలిచింది. 

Also Read: Weather: రుతుపవనాల సీజన్‌ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!

ఎంతో హ్యాపీగా ఉంది

ఈ విజయంపై హంపి తాజాగా స్పందించింది. ఈ విజయం పట్ల తాను ఎంతో హ్యాపీగా ఉన్నట్లు తెలిపింది. అయితే ముందుగా ఇది చాలా కఠినమైన రోజు అవుతుందని అనుకున్నాను అని తెలిపింది. కానీ అలాంటి అడ్డంకులేవి లేకుండా విజయం సాధించడం ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. భారత్‌కు ఇది చాలా మంచి సమయం అని తాను భావిస్తున్నట్లు పేర్కొంది. 

Also Read: Disney+Hotstar: ఉచిత డిస్నీ+హాట్ స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను అందించే టాప్‌ రీఛార్జ్‌ ప్లాన్ లు ఇవే

ప్రపంచ ఛాంపియన్ గుకేష్ భారతీయుడేనని.. ఇప్పుడు తాను కూడా ర్యాపిడ్ ఈవెంట్‌లో రెండవ ప్రపంచ టైటిల్‌ను గెలిచానని ఎంతో హ్యాపీగా ఫీలైంది. ఈ విజయాలు భారత యువతను ఎంతగానో ప్రేరేపిస్తాయని తాను భావిస్తున్నట్లు హంపి చెప్పుకొచ్చింది. 

Also Read: Mumbai: ఇండిగో విమానం 16గంటలు లేట్..ఎయిర్పోర్ట్‌లో ప్రయాణికులు పాట్లు

2024 మరిచిపోలేని సంవత్సరం

హంపి విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. కోనేరు హంపి విజయం దేశానికే గర్వకారణమని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. 2024 మన దేశ చెస్ క్రీడాకారులకు మరిచిపోలేని సంవత్సరమని తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు