Yuvraj Singh: 2007ను గుర్తుకుతెచ్చిన యువరాజ్.. 7 సిక్సర్లతో స్టేడియం షేక్!

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్ చెలరేగిపోయాడు. మొత్తం 7సిక్సర్లతో రచ్చరచ్చ చేశాడు. దీంతో 2007 తొలి టి20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌ను గుర్తు చేశాడు.

New Update
Yuvraj Singh smashes 7 sixes as India Masters

Yuvraj Singh smashes 7 sixes as India Masters

Yuvraj Singh IML Videos

ప్రస్తుతం ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 జరుగుతోంది. ఇది కేవలం రిటైరైన క్రికెటర్ల కోసం మాత్రమే నిర్వహించారు. ఈ టోర్నీలో భారత్ దూసుకుపోతోంది. సచిన్ టెడ్కూలర్ సారథ్యంలో వరుస విజయాలతో పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. 

Also Read :  పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!

ఈ మ్యాచ్ గెలుపులో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. గ్రౌండ్‌లో పరుగుల వరద పెట్టించాడు. యువరాజ్ బాదిన అద్భుతమైన సిక్సర్లు అభిమానులకు అతని పాత విజయాలను గుర్తుకు తెచ్చాయి. ఈ మ్యాచ్‌లో అతడు 7 సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. దీంతో సెప్టెంబర్ 19, 2007 తొలి టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్సర్లు బాదిన క్షణాలను ఫ్యాన్స్ గుర్తుకు తెచ్చుకున్నారు. 

ఈ IMLలో యువరాజ్ 30 బంతుల్లో 59 పరుగులు చేశాడు. అందులో 7 సిక్సర్లు, ఒక ఫోర్ ఉంది. ముఖ్యంగా అతడు ఆస్ట్రేలియా లెగ్-స్పిన్నర్ మెక్‌గెయిన్‌ వేసిన ఒకే ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదాడు. దీంతో అతిపెద్ద హిట్టర్లలో ఒకడిగా తన హోదాను మరోసారి నిరూపించుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా తన ప్రతిభను ప్రదర్శించాడు. 30 బంతుల్లో 7 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. అలాగే ఆల్ రౌండర్ స్టూవర్ట్ బిన్నీ 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. యూసుఫ్ పఠాన్ 10 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ కూడా 7 బంతుల్లో 19 పరుగులు చేసి అద్భుతంగా రాణించారు.

Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..

ఇలా భారత్ 7 వికెట్ల నష్టానికి 220 పరగులు సాధించింది. దీంతో ఈ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే అంతమైంది. పవర్‌ప్లే లోపల ఆస్ట్రేలియా మాస్టర్స్ మూడు వికెట్లు కోల్పోయింది. ఇక పవర్‌ప్లే తర్వాత ఆస్ట్రేలియా 49/3తో ఇబ్బంది పడింది. మొత్తంగా భారత మాస్టర్స్ బౌలర్లు ఆస్ట్రేలియా మాస్టర్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు