WPL 2026 Schedule: WPL.. ఏఏ ప్రాంఛైజీలు ఎవరెవర్ని రిటైన్‌ చేసుకున్నాయంటే..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( WPL ) మెగా వేలం నవంబర్ 27న జరగనుంది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్‌ను విడుదల చేశాయి. ప్రతి జట్టు ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకోవచ్చు. అందులో ముగ్గురు భారత క్యాప్డ్ ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండాలి.

New Update
WPL 2026 Schedule

WPL 2026 Schedule

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( WPL ) మెగా వేలం నవంబర్ 27న జరగనుంది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్‌ను విడుదల చేశాయి. ప్రతి జట్టు ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకోవచ్చు. అందులో ముగ్గురు భారత క్యాప్డ్ ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండాలి. ఈ ఐదుగురిలో ఒక్కొక్కరిని ఒక్కో ధరకు ఫ్రాంఛైజీలు కొనుక్కుంటాయి. వీటిలో ఐదు స్లాబ్‌లుండగా.. అవి రూ.3.5 కోట్లు, రూ.2.5 కోట్లు, రూ.1.75 కోట్లు, రూ.1 కోటి,  రూ.50 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఏ ఏ ఫ్రాంఛైజీ ఏ ఏ ప్లేయర్‌ను ఎంత ధరకు రిటైన్ చేసుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read :  ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన బుమ్రా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

స్మృతి మంధాన (రూ.3.5కోట్లు), రిచా ఘోష్ (రూ.2.75 కోట్లు), ఎల్లీస్ పెర్రీ (రూ.2కోట్లు), శ్రేయాంక పాటిల్ (రూ.60లక్షలు). వీరిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకుంది. 

ముంబై ఇండియన్స్

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (2.5 కోట్లు), నాట్‌స్కివర్‌ బ్రంట్‌(రూ.3.5 కోట్లు), హేలీ మ్యాథ్యూస్‌(రూ.1.75 కోట్లు), అమన్‌జ్యోత్‌ కౌర్‌(రూ.1కోటి), జి.కమిలినిని (రూ.50లక్షలు). వీరిని ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది. అయితే ఈ సారి ఈ ఫాంఛైజీ హర్మన్ ప్రీత్ కౌర్ కంటే నాట్‌స్కివర్‌ బ్రంట్‌కు అధికంగా కేటాయించడం విశేషం.  

ఢిల్లీ క్యాపిటల్స్

జెమిమా రోడ్రిగ్స్ (రూ.2.2కోట్లు), షఫాలీ వర్మ (రూ.2.2కోట్లు), మారిజానే కాప్  (రూ.2.2కోట్లు), అన్నాబెల్ సదర్లాండ్ (రూ.2.2కోట్లు), నికి ప్రసాద్ (రూ.50లక్షలు). ఢిల్లీ క్యాపిటల్స్ వీరిని మెగా వేలం కంటే ముందు రిటైన్ చేసుకుంది. 

Also Read :  ప్రధాని మోడీకి క్రికెటర్ హర్లీన్ డియోల్ చిలిపి ప్రశ్న..ఏం అడిగిందంటే?

గుజరాత్ జెయింట్స్

ఆష్లీ గార్డనర్ (రూ.3.5కోట్లు), బెత్ మూనీ (రూ.2.5 కోట్లు).. ఇద్దరిని మాత్రమే గుజరాత్ జెయింట్స్ రిటైన్ చేసుకుంది. 

యుపి వారియర్జ్

యుపి వారియర్జ్ కేవలం శ్వేతా సెహ్రావత్ (రూ.50 లక్షలు)ను మాత్రమే రిటైన్ చేసుకుంది. దీంతో అన్ని ఫ్రాంఛైజీల కంటే ఈ ఫ్రాంఛైజీ దగ్గరే అధిక డబ్బు మిగిలి ఉంది. 

అనంతరం మెగా ఆక్షన్‌లో పాల్గొననున్న ప్లేయర్ల లిస్ట్ కూడా విడుదలైంది. నవంబర్ 27న మెగా వేలంలో మెగ్ లానింగ్, లారా వోల్వార్ట్‌, దీప్తి శర్మ, అలిస్సా హీలీ, సోఫీ ఎక్లెస్టోన్‌ను ఆయా ప్రాంఛైజీలు విడుదల చేశాయి.

Advertisment
తాజా కథనాలు