Jasprit Bumrah Record: ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన బుమ్రా

ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టీ20లో జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ మాజీ గ్రేట్ సయీద్ అజ్మల్ పేరిట ఉన్న రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. దీంతో ఆస్ట్రేలియాపై టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు.

New Update
Jasprit Bumrah created history

Jasprit Bumrah created history

ఆస్ట్రేలియా(australia) తో జరిగిన నాల్గవ టీ20(ind-vs-aus-t20-series)లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(jaspreet-bumrah) చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ మాజీ గ్రేట్ సయీద్ అజ్మల్ పేరిట ఉన్న రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. దీంతో ఆస్ట్రేలియాపై టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఇవాళ జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌లో బుమ్రా ఈ ఘనతను సాధించాడు. 

Also Read :  బెట్టింగ్ యాప్స్ కేసు.. మాజీ క్రికెటర్లకు బిగ్ షాక్

Jasprit Bumrah Created History

ఈ మ్యాచ్ కు ముందు జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాపై 16 ఇన్నింగ్స్ ల్లో 19 వికెట్లు పడగొట్టి.. 11 ఇన్నింగ్స్ ల్లో 19 వికెట్లు తీసిన పాకిస్తాన్ దిగ్గజం సయీద్ అజ్మల్ రికార్డును సమం చేశాడు. ఇవాళ్టి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఒక వికెట్ పడగొట్టి.. టీ20 ఫార్మాట్ లో ఆసీస్ పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో బుమ్రా, రెండవ స్థానంలో సయీద్ అజ్మల్ ఉన్నారు. మూడో స్థానంలో మహ్మద్ అమీర్ (17 ఇన్నింగ్స్‌లలో 10 వికెట్లు), నాల్గవ స్థానంలో మిచెల్ సాంట్నర్ (12 ఇన్నింగ్స్‌లలో 17 వికెట్లు) ఉన్నారు. 

Also Read :  అమ్మకానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. అంతా సిద్ధం!

ఇదిలా ఉంటే ఇవాళ్టి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 28 పరుగులు, శుభ్‌మన్ గిల్ 39 బంతుల్లో 46 పరుగులు, శివమ్ దూబే 18 బంతుల్లో 22 పరుగులు, తిలక్ వర్మ 6 బంతుల్లో 5 పరుగులు చేశారు. 

లక్ష్యాన్ని  ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. 18.2 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.

Advertisment
తాజా కథనాలు