Asia Cup 2025: వెదవల్లారా.. మీరు మారరు రా.. పాక్ టీంపై దుమ్మెత్తి పోస్తున్న సొంత ప్రజలు-VIDEO

భారత్ చేతిలో ఓడిపోవడం పాకిస్తాన్ ప్రత్యేక వృత్తి అని తెలిపిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పాకిస్తాన్ వారు ఎప్పుడు ఓడిపోతారని, హిట్లర్ చేసినట్లుగానే చేయాలని అంటున్నారు. ఇలాంటి వారిని ఫిరంగులు కట్టి బాంబుతో పేల్చేయాలని అన్నారు.

New Update
Pakistan

Pakistan

చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌పై భారత్ మరోసారి అద్భుతంగా ఆడింది. ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి తొమ్మిదోసారి ఆసియా కప్‌ను గెలుచుకుంది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ పేలవమైన ఆరంభం చేసింది. అయితే మొదటి ఐదు ఓవర్లలోనే 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ చివరకు భారత్ మ్యాచ్‌ను తన వైపు తిప్పుకుంది. అయితే మ్యాచ్ ఓడిపోవడంతో పాకిస్తాన్ జట్టు ఫ్యాన్స్‌తో పాటు అందరిలో నిరాశ కనిపించింది. ఎందుకంటే ఈ ఆసియా కప్‌లో మూడు మ్యాచ్‌లు కూడా పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. దీంతో క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ టీంపై కోపంగా ఉన్నారు. 

ఇది కూడా చూడండి: IND VS PAK: ఆపరేషన్ సిందూర్ మళ్ళీ సక్సెస్.. టీమ్ ఇండియా విక్టరీపై మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

పాకిస్తాన్ క్రికెట్ జట్టే కారణం..

భారత్ చేతిలో ఓడిపోవడం వల్ల మొత్తం ప్రజలు పాకిస్తాన్ క్రికెట్ జట్టును నిందిస్తున్నారు. అయితే పాకిస్తాన్ యూట్యూబర్ షోయబ్ చౌదరి ఓ వ్యక్తి ని అడగ్గా అతను చెప్పిన ఆన్సర్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భారత్ చేతిలో ఓడిపోవడం పాకిస్తాన్ ప్రత్యేక వృత్తి అని తెలిపిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పాకిస్తాన్ వారు ఎప్పుడు ఓడిపోతారని, హిట్లర్ చేసినట్లుగానే చేయాలని అంటున్నారు. ఇలాంటి వారిని ఫిరంగులు కట్టి బాంబుతో పేల్చేయాలని అన్నారు. అన్ని జట్లుతో పాక్ ఓడిపోతే పర్లేదు. కానీ భారత్ చేతిలో ఎట్టిపరిస్థితుల్లో ఓడిపోకూడదన్నారు. ఆటగాళ్లు భావోద్వేగాలతో ఆడుకున్నారని పాక్ ప్రజలు మండిపడుతున్నారు. చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తున్నారని అంటున్నారు.

ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ గురించి అసంతృప్తి వ్యక్తం చేసి పీసీబీని ప్రశ్నించారు. పాక్ జట్టు దేశీయ క్రికెట్ కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చారని, కానీ పెద్ద మ్యాచ్‌లలో వారి అనుభవం లేకపోవడం ఓడిపోయారని అంటున్నారు. భారత జట్టు అద్భుతమైన బౌలింగ్, బలమైన ఫీల్డింగ్, కెప్టెన్సీ అన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుందిన్నారు. ఒత్తిడిలో ఉన్నా కూడా భారత్ ఆత్మవిశ్వాసంతో ఓడి గెలిచిందని పాక్ ప్రజలు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: ఆసియాకప్ విజయం.. టీమ్ ఇండియాకు BCCI భారీ నజరానా!

Advertisment
తాజా కథనాలు