/rtv/media/media_files/2025/03/22/g29XVJwZnHpZNIBqJGvu.jpg)
Kolkatha Eaden Gardens
ఏడాదిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 మొదలయ్యే రోజు వచ్చేసింది. ఈరోజు మొదటి మ్యాచ్ కోలకత్తా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాంలెజర్స్ మధ్యన జరగనుంది. ఈరోజు కోలకత్తాలో ఈడెన్ గార్డెన్స్ లో మొదట గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మనీ...తరువాత మ్యాచ్ జరగనుంది. అయితే ఇవననీ అనుకున్నట్టు జరుగుతాయా లేదా అనేది అనుమానంగా మారింది. కోలకత్తాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. దాంతో పాటూ అక్కడ ఆరెంజ్ అలెర్ట్ కూడా ప్రకటించింది వాతావరణశాఖ. దీంతో మొదటి మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది డౌట్ లో పడింది.
కోలకత్తాలో ఆరెంజ్ అలెర్ట్..
కోలకత్తాలో నిన్న కూడా వర్షం భారీగా పడింది. నిన్న సాయంత్రం నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ రెండు జట్లూ ప్రాక్టీస్ చేస్తుండగా.. 6 గంటలకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభం అయింది. దాదాపు కోలకత్తా అంతా వర్షం కురిసింది. దీంతో ఇరు జట్లూ ప్రాక్టీస్ కు ప్యాక్ అప్ చెప్పాయి. స్టేడియం సిబ్బంది వెంటనే తేరుకుని పిచ్ పైన, గ్రౌండ్ లో కవర్స్ పరిచారు. దీని వలన కనీసం పిచ్ తడిగా అయిపోకుండా ఉంది. కోలకత్తాలో న్యూ ఎలిపోర్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ రెండురోజులు తీవ్రమైన గాలులు, ఉరుములు మెరుపులు, పిడుగులతో పాటు వడగళ్ల వాన పడే అవకాశం ఉందని ప్రకటించింది. దీంతో మ్యాచ్ తో పాటూ ఓపెనింగ్ సెర్మనీ కూడా జరగదేమో అని అనుమానంగా ఉంది. ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అంతకు ముందు సెలబ్రిటీలతో ఈవెంట్ జరగాల్సి ఉంది.
today-latest-news-in-telugu | ipl-2025 | kolkata | match | rain
Also Read: TS: తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్..అధికారులను అప్రమత్తం చేయాలన్న సీఎం