TS: తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్..అధికారులను అప్రమత్తం చేయాలన్న సీఎం

తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈరోజు రెండు, మూడు జిల్లాల్లో వడగండ్ల వానలు కురిశాయి. మరో 48 గంటలు ఇదే పరిస్థితి ఉంటుదన్న హెచ్చరికతో...అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

New Update
ts

CM Revanth Reddy, CS santhi kumari

తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమైయ్యాయి. రోడ్లపై చెట్లు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలంలో పలు చోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటలకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతొ బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేస్తున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాల పల్లి, పెద్దపల్లి, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

అధికారులను అప్రమత్తం చేయాలన్న సీఎం..

ఈ వర్షాలపై తెలంగాణ జిల్లాల అధికారులు అప్పమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. వెంటనే సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన తెలంగాణ సీఎస్  రానున్న 48 గంటలలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచన ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలంటూ అవసరమైన సూచనలు చేశారు.

today-latest-news-in-telugu | orange-alert | cs-santhi-kumari 

Also Read: CM Revanth: చెన్నైకు చేరిన సీఎం రేవంత్ రెడ్డి..రేపు డీలిమిటేషన్ సదస్సులో...

Advertisment
తాజా కథనాలు