Pakistan cricket : సిగ్గులేని పాక్..ఎంతకు తెగిచిందంటే?

ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్‌తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం నుంచి ఎట్టకేలకు మ్యా్చ్ అయితే గంట తరువాత ప్రారంభం అయింది.  

New Update
pak

ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్‌తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం నుంచి ఎట్టకేలకు మ్యాచ్ అయితే గంట తరువాత ప్రారంభం అయింది.   ముందుగా టాస్ గెలిచిన  యూఏఈ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్‌ బ్యాటింగ్ కు దిగింది. భారత్ తో షేక్ హ్యాండ్ వివాదం చెలరేగడంతో పాకిస్తాన్ దారుణంగా హర్ట్ అయింది.

ఇది పెద్ద అవమానంగా పాక్ ఫీల్ అయింది. ప్రతీకారంగా  ఎదైనా చేయాలని అనుకుంది.  మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని లేకపోతే తాము UAEతో మ్యాచ్ ఆడబోమని బెదిరింపులకు దిగింది. అయినప్పటికీ ఐసీసీ ఏ మాత్రం తగ్గలేదు. అంతేస్థాయిలో పాక్ కు కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ కు కూడా మ్యాచ్ కు కూడా రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నే కొనసాగించింది. అయితే  ఈ వివాదాన్ని పాక్ మరోలా క్లెయిమ్ చేసుకుంది.

పాక్ కెప్టెన్ కు  క్షమాపణలు

భారత్ తో షేక్ హ్యాండ్ వివాదంపై అతను పాక్ కెప్టెన్ కు  క్షమాపణలు చెప్పినట్లుగా ప్రచారం చేసుకుంటుంది. దీంతో నెటిజన్లు పాక్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు మ్యాచ్‌ ఆడకుంటే రూ. 140 కోట్లు కట్టాలన్న ఐసీసీ కూడా పీసీబీ కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది.  ఫెనాల్టీ కట్టలేక మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన పీసీబీ తమ ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్‌ రిఫరీ మార్చకుండానే యూఏఈతో చివరి మ్యాచ్ కు పాక్ బరిలోకి దిగడం ఇక్కడ అసలు ట్విస్ట్..  అతన్ని తప్పించాలని నానా హంగామా చేసిన పాక్ చివరకు తోకముడించిందనే చెప్పాలి.  కాగా పాకిస్తాన్ యుఎఇని ఓడించి సూపర్ ఫోర్స్‌కు చేరుకుంటే, సెప్టెంబర్ 21న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్‌తో మళ్లీ తలపడనుంది. 

Advertisment
తాజా కథనాలు