Virat Kohli Test Retirement: విరాట్‌ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది వీరిలో ఎవరు?

విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో కోహ్లీ స్థానాన్ని ఏ ఆటగాడు రీప్లేస్ చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. విరాట్ ప్లేస్‌ను భర్తీ చేయడానికి కరుణ్‌ నాయర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రజత్‌ పటీదార్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

New Update
who can replace virat kohli in india test line up

who can replace virat kohli in india test line up

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టీమిండియాకు, తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. సడెన్‌గా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్ ఫార్మట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ పోస్టు చేశాడు. ఇదిలా ఉంటే కింగ్ కోహ్లీ గతేడాది బార్బడోస్‌లో భారత్ ప్రపంచ కప్ విజయం తర్వాత టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చూడండి:  AP BREAKING: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

కోహ్లీ స్థానంలో ఏ ఆటగాడంట?

ఇకపోతే కింగ్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరిలోనూ ఓ చర్చ మొదలైంది. టెస్టుల్లో విరాట్ తర్వాత ఆ స్థానాన్ని ఏ ఆటగాడు భర్తీ చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడంతా అదే విషయంపై గుసగుసలాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ప్లేస్‌ను భర్తీ చేసేందుకు భారత ఆటగాళల్లో కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: BIG BREAKING : రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO

వారిలో కరుణ్ నాయర్, దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పటిదార్ వంటి ప్లేయర్లు ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. మరి వీరిలో ఏ ఆటగాడు కింగ్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేస్తారు అనేది ఉత్కంఠగా మారింది. చాలా మంది విరాట్ ప్లేస్‌ను రుతురాజ్ గైక్వాడ్ లేదా కరుణ్ నాయర్ రీప్లేస్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో. 

ఇది కూడా చూడండి: Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

9,230 పరుగులు

కోహ్లీ తన టెస్ట్ రిటైర్మెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో భావోద్వేగంతో ప్రకటించాడు. 14 ఏళ్ల పాటు టెస్టుల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నాడు కోహ్లీ. తాను ఎప్పుడూ తన టెస్ట్ కెరీర్‌ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటానని తెలిపాడు.  కోహ్లీ తన టెస్టు కెరీర్ లో 123 టెస్టుల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి.  స్వదేశంలో 55 టెస్ట్ మ్యాచ్‌ల్లో కోహ్లీ 55.58 సగటుతో 4,336 పరుగులు సాధించగా, విదేశాల్లో 66 మ్యాచ్‌ల్లో కోహ్లీ 41.51 సగటుతో 4,774 పరుగులు సాధించాడు. 2014 నుండి 2022 వరకు టీమిండియాకు నాయకత్వం వహించిన కోహ్లీ 68 టెస్టుల్లో 40 విజయాలు అందించాడు. సక్సెస్ రేట్  58శాతంగా ఉంది.  

virat kohli test retirement | virat-kohli | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు