/rtv/media/media_files/2025/02/26/V5qoSVgz9u0IBPnKZiMs.jpg)
Virat Kohli RCB team will win the trophy IPL 2025 season fans dance video viral
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ఇందులో భాగంగా టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడి.. రెండూ గెలిచింది. రీసెంట్‌గా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ విరాట్ దుమ్ము దులిపేశాడు. గత ఏడాది నుంచి ఫామ్‌లేని అతడు ఎన్నో విమర్శలు, ట్రోలింగ్స్ ఎదుర్కొన్నాడు. కానీ పాక్ తో మ్యాచ్‌లో మాత్రం తన ఉగ్రరూపం చూపించాడు.
Also Read: మజాకా రివ్యూ.. సందీప్ కిషన్ ఖాతాలో హిట్ పడిందా?
సెంచరీ చేయడమే కాకుండా భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఆట తీరుకు యావత్ భారత్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. పాకిస్తానీయులు సైతం ఫిదా అయిపోయారు. జయహో కింగ్ కోహ్లీ అంటూ జై కొట్టారు. దీంతో ఇప్పుడు చేయండ్రా ట్రోలింగ్స్ అంటూ కోహ్లీ ఫ్యాన్స్ నెట్టింట రచ్చ రచ్చ చేశారు.
Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?
RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ
ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. త్వరలో IPL 2025 సీజన్ మొదలు కాబోతుంది. ఈ తరుణంలో కోహ్లీ కంబ్యాక్‌తో RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈసారి కప్ నమ్‌దే అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా RCB కోహ్లీ ఫ్యాన్స్ పెళ్లి బరత్‌లో దుమ్ము దులిపేశారు.
Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!
డ్యాన్సులతో హంగామా చేశారు. ‘మట్టి తవ్వేది JCB.. ఈసారి కప్పు కొట్టేది RCB’ అంటూ పాట పాడుతూ మాస్ డ్యాన్స్‌తో సందడి సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన డాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోపై RCB ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.