ఎయిర్‌పోర్టులో జర్నలిస్టులతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. వీడియో వైరల్

మెల్‌బోర్న్‌ ఎయిర్‌పోర్టులో విరాట్ కోహ్లీకి అక్కడి మీడియా జర్నలిస్టులతో వాగ్వాదం జరిగింది. తన పర్మిషన్ లేకుండా భార్య, పిల్లలు ఫొటోలు, వీడియోలు తీయడంపై కొహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాటిని డిలీట్‌ చేయాలని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

New Update
Kohli

డిసెంబర్ 26 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం టీమిండియా మెల్‌బోర్న్‌కు చేరుకుంది. అయితే మెల్‌బోర్న్‌ ఎయిర్‌పోర్టులో విరాట్ కొహ్లీకి అక్కడి మీడియా జర్నలిస్టులతో వాగ్వాదం జరిగింది. ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్‌ను ఎయిర్‌పోర్టులో కొందరు జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇదే సమయంలో విరాట్‌ కొహ్లీ.. భార్య అనుష్క శర్మ, పిల్లలు అకాయ్, కుమార్తె వామికలతో కలిసి అటువైపు నుంచి వచ్చాడు. దీంతో మీడియా ప్రతినిధులు కొహ్లీ ఫ్యామిలీని ఫొటోలు, వీడియోలు తీసేందుకు యత్నించింది.    

Also Read: పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్తత.. ఇండియా, ఎన్డీయే కూటమి ఆందోళనలు

దీంతో కోహ్లీకి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫొటోలు ఎందుకు తీశారంటూ జర్నలిస్టులతో వాగ్వాదానికి దిగాడు. నా పిల్లల విషయంలో ప్రైవసీ కావాలని.. నన్ను అడగకుండా ఫొటోలు తీయొద్దని అన్నాడు. ఆ తర్వాత ఓ జర్నలిస్టు వద్దకు వెళ్లి ఆ ఫొటోలు, వీడియోలు చూపించాలన్నాడు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఏమైనా ఉంటే డిలీట్ చేయాలని చెప్పాడు. 

Also Read: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు

ఇదిలాఉండగా.. విరాట్ కోహ్లీ ఎప్పుడూ కూడా తన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. తన సోషల్ మీడియాలో కూడా వాళ్ల ఫొటోలు పోస్టు చేస్తే ముఖాలు కనిపించకుండా ఎమోజీలు పెడుతాడు. ఇక బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీకి సంబంధించి మొదటి టెస్టులో భారత్‌, రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచాయి. మూడో మ్యాచ్‌ డ్రా అయ్యింది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది.    

Also Read: ఛీ ఛీ వీడేం డైరెక్టర్.. మహిళల బాత్రూంలో స్పై కెమెరా పెట్టి మరీ!

Also Read: అంబేడ్కర్ Vs దేవుడు.. అమిత్‌షాపై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు