సభ్య సమాజం తలదించుకునేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. పాఠాలు చెప్పి విద్యా బుద్దులు నేర్పించాల్సిన కొందరు పాడు చేష్టలకు అలవాటు అవుతున్నారు. ఈ క్రమంలో వారి ఆనందం కోసం విచిత్రంగా ప్రవర్తించి కటకటాలపాలవుతున్నారు. ఇది కూడా చూడండి: లెస్బియన్స్‌తో సహజీవనం చట్టబద్ధమే.. హైకోర్టు సంచలన తీర్పు టీచర్ బాత్రూంలో స్పై కెమెరా తాజాగా జరిగిన సంఘటన దీనికి నిదర్శనం అనే చెప్పాలి. ఓ పాఠశాల డైరెక్టర్ స్కూల్ పరిస్థితేంటి, స్కూల్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచించడం మానేసి టీచర్ల బాత్రూంలో రహస్య కెమెరాలు పెట్టాడు. ఆ కెమెరాలకు తన ఫొన్, కంప్యూటర్‌లో మానిటరింగ్ చేసి వికృత ఆనందం పొందాడు. ఈ విషయం తాజాగా బయటపడటంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇది కూడా చూడండి: ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా సెక్టార్ 70లోని ప్లే స్కూల్ డైరెక్టర్‌గా నవనీస్ సహాయ్ అనే వ్యక్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల అంటే డిసెంబర్ 10న ఓ టీచర్ బాత్రూంలోని బల్బ్ హోల్డర్‌లో స్పై కెమెరా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఈ విషయాన్ని స్కూల్ డైరెక్టర్ అయిన నవనీస్ సహాయ్‌తో పాటు స్కూల్ కో-ఆర్డినేటర్ పరుల్‌కి చెప్పారు. ఇది కూడా చూడండి: బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు అయితే వారు మాత్రం దీన్ని ఖండించారు. ఈ విషయాన్ని నవనీస్ సైలెంట్ చేసే ప్రయత్నం చేశాడు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఉపాధ్యాయ సిబ్బంది తమ గలం వినిపించారు. స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని.. ఉపాధ్యాయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసులో అసలు ముద్దాయి స్కూల్ డైరెక్టర్ నవనీస్ అని తేల్చారు. ఆపై అతడిని అరెస్టు చేశారు. ఇది కూడా చూడండి: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ అయితే ఆ స్పై కెమెరాను రూ.22వేలకు ఆన్‌లైన్‌లో కొన్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇదిలా ఉంటే మరోవైపు స్కూల్ బాత్రూంలో గతంలోనూ రహస్య కెమెరాలు గుర్తించినట్లు టీచర్లు పేర్కొన్నారు. అప్పుడు స్కూల్ కోఆర్డినేటర్‌కి అందజేశామని.. కానీ అప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఇక తాజాగా జరిగిన సంఘటనపై విచారణ కొనసాగుతున్నందున స్కూల్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు.