అంబేడ్కర్ Vs దేవుడు.. అమిత్‌షాపై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు

'అంబేద్కర్ అని చెప్పుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఇన్నిసార్లు దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో చోటు దక్కేది' అంటూ రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అమిత్‌ షా వెంటనే క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

author-image
By srinivas
New Update
s rwed

National: అంబేడ్కర్‌ను ఉద్దేశిస్తూ రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. అమిత్‌ షా వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంటు ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. బీజేపీ కులతత్వ, దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమంటూ మమతా బెనర్జీ మండిపడ్డారు. మిస్టర్ షా దళితుల చిహ్నాన్ని అవమానించారని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేశారు. హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఎలా పక్కన పెట్టిందనే విషయాన్ని కాకుండా.. ఈ చిన్న వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ ప్రసారం చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 

ప్రియాంక గాంధీ.. 

‘అంబేడ్కర్‌ కోట్లాది మంది దళితులు, అణగారిన వర్గాల ప్రజల ఆత్మగౌరవాలకు ప్రతీక. ఆయన పేరు ప్రస్తావించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తాం. అలాంటి వ్యక్తిని బీజేపీ కించపరుస్తోందంటూ ప్రియాంక మండిపడ్డారు. 

మమతా బెనర్జీ.. 

'అంబేడ్కర్‌ మార్గదర్శకత్వం, స్ఫూర్తిబాటలో నడిచే లక్షలాది మందికి అమిత్ షా వ్యాఖ్యలు అవమానకరం. ఈ వ్యాఖ్యలతో బీజేపీ ముసుగు వీడిపోయింది. ప్రజాస్వామ్య దేవాలయంలోనే అంబేడ్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం దారుణం. ద్వేషంతో నిండిపోయిన పార్టీ నుంచి ఇంకేమి ఆశించగలం' అని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 అమిత్ షా ఏమన్నారంటే.. 

‘బీఆర్ అంబేద్కర్ పేరుని చెప్పడం ప్రతిపక్షాలకు ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ అని చెప్పుకోవడం ఫ్యాషన్ గా భావిస్తున్నారు. ఇన్నిసార్లు దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో చోటు దక్కేది' అని అమిత్ షా అన్నారు. 

మోదీ విమర్శలు.. 
ఈ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్‌‌తో పాటు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. అంబేడ్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను కించపరిచేందుకు కాంగ్రెస్ ఎలాంటి విధివిధానాలను ఆచరిస్తోందో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ, దాని కుళ్లిన పర్యావరణ వ్యవస్థ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడాన్ని ద్వేషపూరిత అబద్దాలు దాచగలవని భావిస్తే వారంతా పొరపాటుపడ్డట్లే. దేశ ప్రజలు ఓ రాజవంశం నాయకత్వంలోని పార్టీ ఎలాంటి విధివిధానాలను ఆచరిస్తోంది? అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి, SC/STలను అవమానపరిచేందుకు అవసరమైన ప్రతీ అవకాశాన్ని వదులుకోకపోవడాన్ని గమనిస్తున్నారు' అని విమర్శించారు. 

ఉద్ధవ్‌ ఠాక్రే
 బీజేపీ మిత్రపక్షాలు అమిత్‌ షా వ్యాఖ్యలతో ఏకీభవిస్తాయా? అంటూ శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రశ్నించారు. అంబేడ్కర్‌ పేరును బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్డారు. ఆయన సేవలను గౌరవించడంలో విఫలమవుతూనే ఉన్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisment
తాజా కథనాలు