భర్త మరణానంతరం తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తమిళనాడులో సేలంకు చెందిన చిన్నయ్యన్ మృతి చెందాడు. భర్త చనిపోయిన తర్వాత అతని భార్య మల్లిక వేరే వివాహం చేసుకుంది. దీంతో ఆమెకు అతని ఆస్తి చెందదని, ఇవ్వడానికి చిన్నయ్యన్ కుటుంబ సభ్యులు కూడా నిరాకరించారు. ఇది కూడా చూడండి: 50 మంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. జనసేన నేత నిర్వాకం!? పునర్వివాహం చేసుకోవడం వల్ల ఆస్తిలో.. ఈ విషయంలో మల్లిక తమిళనాడులోని సేలంలో ఉన్న జిల్లా కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు రెండో పెళ్లి చేసుకుంటే దివంగత భర్త ఆస్తి రాదని తెలిపింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె హైకోర్టులో పిటిషన్ వేసింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేస్తూ.. మహిళ పునర్వివాహం చేసుకున్నా కూడా మృతి చెందిన భర్త ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు హిందూ వివాహ చట్టం ప్రకారం ఉంటుందని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇది కూడా చూడండి: బ్లాక్ చీరలో హాట్ బాంబ్‌లా రష్మిక.. నడుము అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ! హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం మొదటి భర్త ఆస్తిలో వాటా అడిగే హక్కు భార్యకు ఉంటుందని మల్లిక లాయర్ కోర్టులో వాదించారు. దీంతో వాదనలు విన్న కోర్టు ఆ మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చింది. రెండో పెళ్లి చేసుకున్నారని ఆస్తిని వారసత్వంగా తీసుకోకూడదనే రూల్ లేదని తెలిపింది. ఇలాంటి రూల్ 2005లోనే రద్దు అయ్యిందని, వారసత్వంలో అందరూ కూడా సమానత్వం పాటించాలని హైకోర్టు తెలిపింది. పురుషులతో పాటు మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కుల ఉంటాయని మద్రాసు కోర్టు వెల్లడించింది. ఇది కూడా చూడండి: నాకు ఆ టైమ్ వచ్చింది.. డ్రెస్సింగ్ రూమ్‌లో అశ్విన్ ఎమోషనల్! ఇది కూడా చూడండి: చిలుకను పట్టిస్తే రూ.1 లక్ష.. ఆఫర్ అదిరింది గురూ..!