పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్తత.. ఇండియా, ఎన్డీయే కూటమి ఆందోళనలు

అంబేద్కర్‌ను అమిత్‌షా అవమానించారని పార్టీకి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టే అంబేద్కర్‌ను అవమానించిందని అధికార పార్టీ నిరసనలు చేపట్టింది. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

New Update
Parlament

Parlament Photograph: (Parlament)

పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార, విపక్ష సభ్యులు పోటీపోటీగా పార్లమెంటు ప్రాంగణంలో నిరసనలు చేస్తున్నారు. అంబేద్కర్‌ను అమిత్‌షా అవమానించారని, చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అమిత్ షా రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు

ఇది కూడా చూడండి: టాలీవుడ్‌లో విషాదం.. బలగం మొగిలయ్య ఇకలేరు

పార్లమెంట్ భవనం పైకి ఎక్కి..

మరోపక్క కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్‌ను అవమానించిందంటూ ఎన్డీయే ఎంపీలు పార్లమెంట్ ముందు ఆందోళనలు చేపట్టారు. పెద్దపల్లి ఎంపీ వంశీ అయితే పార్లమెంట్ భవనం పైకి ఎక్క మరి నిరసనలు చేస్తున్నారు. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రికత్త ఏర్పడింది. 

ఇది కూడా చూడండి: హైదరాబాద్ బుక్ ఫెయిర్.. నేటి నుంచే ప్రారంభం

అమిత్ షా ఏమన్నారంటే?..

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా అమిత్ షా అంబేద్కర్‌‌ను ఉద్దేశించి.. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని చెప్పుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్ అయిపోయింది. ఇన్ని సార్లు దేవుడి పేరు పెట్టుకుని ఉంటే వారికి ఆ స్థానం దక్కేదని, స్వర్గమని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

ఇది కూడా చూడండి: BREAKING: ప్రముఖ రచయిత కన్నుమూత

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు