Virat Kohli: విరాట్ హాఫ్ సెంచరీ.. సిడ్నీలో రో-కో విధ్వంసం

సిడ్నీ స్టేడియంలో ఆస్ట్రేలియాపై జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత హాఫ్ సెంచరీ సాధించాడు. వరుసగా రెండు డకౌట్ల తర్వాత కోహ్లీ ఫామ్‌లోకి రావడం అభిమానులకు ఊరటనిచ్చింది. ఈ హాఫ్ సెంచరీతో భారత్ విజయానికి బాటలు వేశాడు. క్రీజ్ లో రోహిత్ శర్మ, విరాట్ ఉన్నారు.

New Update
Virat Kohli half century against australia in sydney stadium

Virat Kohli half century against australia in sydney stadium

భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌(IND Vs AUS 2nd ODI)లో మూడో మ్యాచ్ నేడు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. ఇప్పటికే సిరీస్‌ను 2-0తో గెలుచుకున్న ఆస్ట్రేలియా, ఈ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి భారత్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు భారత్ ఈ చివరి మ్యాచ్ ను గెలిచి గౌరవంగా ముగించాలని భావిస్తోందో. ఇందులో భాగంగా 237 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన భారత్.. అదరగొడుతోంది. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ లో రో-కో దుమ్ము దులిపేస్తున్నారు. 

Also Read :  రో-కో చించేశారు.. భారత్ ఘన విజయం

Virat Kohli Half Century

రోహిత్ శర్మ(Rohit Sharma) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇప్పుడు విరాట్ కోహ్లీ సైతం 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గత రెండు మ్యాచ్ లలో డకౌట్ గా నిలిచిన విరాట్.. ఈ మ్యాచ్ లో మాత్రం దున్నేస్తున్నాడు. రోహిత్ కేవలం 63 బంతుల్లోనే తన యాభై పరుగులు సాధించగా.. కోహ్లీ 56 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టడం ద్వారా తన విమర్శకులకు చెక్ పెట్టాడు. మొత్తంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 100+ పరుగుల భాగస్వామ్యాన్ని చేరుకున్నారు. 

Also Read :  సెంచరీతో చెలరేగిన రోహిత్.. సిడ్నీలో విధ్వంశకర బ్యాటింగ్

మొదట టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్దేశించిన 50 ఓవర్లలో 46.4 ఓవర్లకు 236 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 237 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగింది. రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగులు రాబట్టారు. వరుసగా పరుగులు వస్తున్నాయనుకున్న సమయంలో గిల్ ఔటయ్యాడు. కీపర్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడు 26 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. 

ఆ తర్వాత విరాట్ క్రీజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గత రెండు మ్యాచ్ లలో డకౌట్ గా నిలిచిన కింగ్.. ఈసారి ఎలాగైన ఒక్క పరుగు చేయాలని అనుకున్నాడు. దీంతో వచ్చి రాగానే సింగిల్ చేశాడు. ఇలా అప్పటి నుంచి రోహిత్, విరాట్ పరుగుల వర్షం రాబట్టారు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ప్రస్తుతం భారత్ విజయానికి మరికొన్ని పరుగులే ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు