/rtv/media/media_files/2025/10/25/india-won-the-odi-final-against-australia-2025-10-25-15-43-09.jpg)
India won the ODI final against Australia.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో మూడో, ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత శతకంతో చెలరేగగా, విరాట్ కోహ్లీ తనదైన శైలిలో హాఫ్ సెంచరీ చేసి రోహిత్‌కు చక్కటి సహకారం అందించాడు. మొత్తంగా 38.3 ఓవర్లలో 237 పరుగుల టార్గెట్ ను ఛేధించారు.
RO-KO steals the show in Sydney as India avoids clean sweep and won the final and third ODI.
— CricTracker (@Cricketracker) October 25, 2025
Rohit Sharma scores his 50th International ton, and Virat Kohli remains unbeaten on 74.#AUSvsINDpic.twitter.com/BFpS0nXPg7
భారత్ ఘన విజయం
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్.. నిర్దేశించిన 50 ఓవర్లలో 46.4 ఓవర్లకు 236 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు చెలరేగిపోయారు. వరుసగా వికెట్లు తీసి.. ఆసీస్ బ్యాటర్లకు చెమటలు పట్టించారు. పరుగుల దాటిని కట్టడి చేసి.. 236 పరుగులకే ఆలౌట్ చేశారు.
India Won over Australia,
— ROLEX 🇺🇸 (@TPD81498900) October 25, 2025
After defeat Pakistan in final now Ind take over Ausis and prove The Number one Team
Rohit Sharma Virat Kohli
After India won Elon Musk has changed the like button must try it#AUSvIND#ViratKohli#RohitSharma#Hitman 2027 World Cup pic.twitter.com/QSZTRPC2Uk
యువ బౌలర్ హర్షిత్ రాణా ఈ మ్యాచ్ లో తన బౌలింగ్ తో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 4 వికెట్లు తీసి అదరగొట్టేశాడు. అనంతరం 237 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్.. కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ లో రోహిత్, కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అభిమానులకు సంతోషాన్నిచ్చింది.
ఇలా 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. కానీ ఈ సిరీస్ ను మాత్రం గెలవలేకపోయింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆసీస్ గత రెండు మ్యాచ్ లను గెలుపొందింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో మాత్రమే భారత్ గెలిచింది.
హిట్‌మ్యాన్ మెరుపులు: రోహిత్ శర్మ తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్ తో సమాధానం చెప్పాడు. 125 బంతుల్లో 121 పరుగులు చేసి అదరగొట్టేశాడు. ఇలా తన ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డే కెరీర్‌లో 33వ సెంచరీని పూర్తి చేశాడు. 13 ఫోర్లు, 3 సిక్సర్లతో రోహిత్ ఇన్నింగ్స్, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్: కింగ్ కోహ్లీ కూడా తన క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రోహిత్‌కు అండగా నిలబడి, నిలకడగా పరుగులు రాబట్టాడు. 81 బంతుల్లో 74 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అందులో 7 ఫోర్లు ఉన్నాయి. రోహిత్, కోహ్లీ భాగస్వామ్యం దెబ్బకు భారత్ విజయం సాధించింది.
Follow Us