/rtv/media/media_files/2025/10/25/rohit-sharma-completes-century-in-match-against-australia-2025-10-25-15-25-28.jpg)
Rohit Sharma completes century in match against Australia
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో, ఫైనల్ సిరీస్(ind-vs-aus-2nd-t20i) లో భారత్ మాజీ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(rohit-sharma) దుమ్ము దులిపేశాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో పరుగులు రాబట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 105 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. సిడ్నీ గ్రౌండ్ లో రోహిత్ తన క్లాసిక్ బ్యాటింగ్ తో భారత్ విజయాన్ని సునాయసం చేశాడు. దీంతో రోహిత్ వన్డేల్లో 33వ సెంచరీనీ నమోదు చేసుకున్నాడు.
Also Read : IND Vs AUS 2nd ODI: రో-కో చించేశారు.. భారత్ ఘన విజయం
Rohit Sharma Century
A knock of pure class in the chase fetches Rohit Sharma his 33rd ODI ton 💯#AUSvIND 📝: https://t.co/gElymMZkV6pic.twitter.com/JshmkbwAtm
— ICC (@ICC) October 25, 2025
ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం అని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. రోహిత్ శర్మ 105 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. ఈ సెంచరీతో ఆసీస్ గడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు (6) సాధించిన విదేశీ ఆటగాడిగా రోహిత్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు.
What a masterclass from Rohit Sharma 💪 A century that defines class, calm, and command — truly The "INDIA CHA RAJA" showing why he’s in a league of his own. 🇮🇳👑#AUSvIND#roko#TeamIndia
— VISION 🍁 (@Vision_Uncoded) October 25, 2025
pic.twitter.com/O997hqK6dhpic.twitter.com/FUXN3DARGi
Also Read : విరాట్ హాఫ్ సెంచరీ.. సిడ్నీలో రో-కో విధ్వంసం
ఇదిలా ఉంటే ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. రోహిత్ తన చిరకాల మిత్రుడు కోహ్లీతో రెండో వికెట్ కు 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించాడు. ఈ విజయంతో కెప్టెన్ శుభ్ మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా జట్టు మూడు వన్డేల సిరీస్ ను 1-2 తో ముగించింది. గత రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైన భారత్ సిరీస్ ను అప్పుడే కోల్పోయింది. ఇక మూడో మ్యాచ్ లోనూ భారత్ ను ఓడించి క్లీన్ స్వీప్ చేయాలన్న ఆసీస్ కోరిక తీరకుండా పోయింది.
ఇక మొదటి రెండు మ్యాచ్ లలో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్ లో చితక్కొట్టేశాడు. 74 పరుగుల హాఫ్ సెంచరీతో రాణించి తన ఫామ్ ను తిరిగి అందుకున్నాడు. మొత్తంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ తో.. సిడ్నీ స్టేడియంలో సిక్సర్ల మోతతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.
Follow Us