IND Vs SA Test: ‘అతడు మరగుజ్జుడే’.. సౌతాఫ్రికా కెప్టెన్‌పై బుమ్రా కాంట్రవర్సియల్ కామెంట్స్ - వీడియో

సౌతాఫ్రికాతో జరుగుతోన్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ అదరగొడుతోంది. స్వదేశంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్ బౌలింగ్‌తో చెలరేగిపోయాడు. 5 వికెట్లు తీసి తొలి ఇన్నింగ్స్‌లో టాప్ బౌలర్‌గా నిలిచాడు.

New Update
bumrah controversial statement on temba bavuma

bumrah controversial statement on temba bavuma

సౌతాఫ్రికాతో జరుగుతోన్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ అదరగొడుతోంది. స్వదేశంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్ బౌలింగ్‌తో చెలరేగిపోయాడు. 5 వికెట్లు తీసి తొలి ఇన్నింగ్స్‌లో టాప్ బౌలర్‌గా నిలిచాడు. మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్ వంటి స్టార్ బ్యాటర్లను ఔట్ చేసాడు. 

బావుమా ఒక మరుగుజ్జుడే

అయితే ఈ తొలి టెస్ట్ మ్యాచ్ సమయంలో బుమ్రా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. మ్యాచ్ సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఒక ‘‘మరుగుజ్జుడే’’ అంటూ బుమ్రా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఏం జరిగిందంటే.. 

తొలి ఇన్నింగ్స్‌లో టెంబా బావుమా క్రీజ్‌లో ఉన్నాడు. అదే సమయంలో బుమ్రా బౌలింగ్ వేయగా.. అది బావుమా ప్యాడ్‌కు తగిలింది. దీంతో బుమ్రా అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. వెంటనే టీమిండియా ప్లేయర్స్ అంతా ఒక దగ్గర సమావేశమై సమీక్షను పరిశీలించారు. రిషబ్ పంత్.. బంతి బావుమా ప్యాడ్‌లను తాకడంపై వ్యాఖ్యానిస్తుండగా, బుమ్రా ఆటలో జోక్యం చేసుకుని ‘‘అతను కూడా మరుగుజ్జుడే’’ అని అన్నాడు. 

దీంతో బుమ్రా మాట్లాడింది స్టంప్ మైక్‌లో రికార్డ్ అయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై చాలా మంది రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో బావుమా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. .

Advertisment
తాజా కథనాలు