IPL 2025: నా 140Km వేగం ఎవరికి కనిపించలేదేమో.. ఉమేష్ షాకింగ్ కామెంట్స్!

ఐపీఎల్ 2025 టోర్నీలో అన్‌సోల్డ్‌గా మిగలడం తీవ్రంగా కలిచివేస్తోందని భారత బౌలర్ ఉమేష్ యాదవ్ అన్నాడు. 150 మ్యాచులు ఆడిన తాను ఇప్పటికీ 140కి.మీ వేగంతో బంతులు వేయగలనని చెప్పాడు. తన పేరు వచ్చేసరికి ఫ్రాంచైజీల వద్ద డబ్బులు అయిపోయాయేమో అని సెటైర్స్ వేశాడు. 

New Update
umesh yadav

umesh yadav

IPL 2025: ఐపీఎల్ 2025 మెగా టోర్నీకోసం తనను ఏ ఫ్రాంచైజీ కొనకపోవడంపై భారత ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్(Umesh Yadav) సంచలన కామెంట్స్ చేశాడు. నిజంగా తనకు ఈ ఐపీఎల్ వేలం నిరాశ కలిగించిందని వాపోయాడు. ఐపీఎల్‌లో 150 మ్యాచ్ లు ఆడిన ఆటగాడు అన్‌సోల్డ్‌గా మిగలడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నాడు. అంతేకాదు తన పేరు వచ్చేటప్పటికి ఫ్రాంచైజీల దగ్గర డబ్బులు అయిపోయాయేమో అంటూ సెటైర్స్ వేశాడు. 

Also Read: ఇండియన్ ఆర్మీ వరల్డ్ రికార్డ్ !.. 40 మంది, 20 ఫీట్ల ఎత్తులో రైడింగ్

150 మ్యాచులు ఆడిన ఖాళీగానే..

ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొ్న్న ఉమేష్‌.. ‘ఐపీఎల్‌ మెగా టోర్నీలో దాదాపు 15 ఏళ్ల పాటు ఆడాను. అయినా 2025 సీజన్‌ ఎంపికకాలేదు. అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం నన్ను షాక్‌కు గురిచేసింది. నిజంగా చాలా బాధ కలిగించింది. 150 మ్యాచులు ఆడి ఇలా ఖాళీగా ఉండటం ఇబ్బందిగానే ఉంది. ఇప్పటికీ 140 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేయగలను. ఏది ఏమైనప్పటికీ ఇది ఫ్రాంచైజీ స్ట్రాటజీ కావొచ్చు. లేదా నా పేరు వచ్చేసరికి ఫ్రాంచైజీల దగ్గర డబ్బులు మిగలలేదేమో. నేను మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యా' అని చెప్పాడు. 

Also Read: Jackky Bhagnani: షూటింగ్ లో ప్రమాదం.. రకుల్ ప్రీత్ భర్తకు గాయాలు!

ఇదే క్రమంలో రిటైర్మెంట్‌ తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ఉమేష్.. ఇంకా సమయం ఉందన్నాడు. కాలు సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకుని చక్కగా బౌలింగ్‌ చేయగలుగుతున్నా. అయితే బౌలింగ్ కు న్యాయం చేయలేనని అనిపించిన రోజే వీడ్కోలు పలికేస్తానని అన్నాడు. 57 టెస్టులు, 75 వన్డేలు, 9 టీ20  ఆడిన ఉమేష్‌.. 280కిపైగా వికెట్లు పడగొట్టాడు. 

Also Read: Jackky Bhagnani: షూటింగ్ లో ప్రమాదం.. రకుల్ ప్రీత్ భర్తకు గాయాలు!

Also Read: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు