MH:రాహుల్ బాబా విమానం మళ్ళీ కూలిపోతుంది–అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

రాహుల్ బాబా అనే పేరు కలిగిన విమానం ఇప్పటికే 20 సార్లు కూలిపోయింది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మళ్ళీ అది కూలిపోతుంది అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమి మీద ఆయన విరుచుకుపడ్డారు. 

New Update
Amith Shah: యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తాం- అమిత్ షా

Home Minister Amith Shah: 

మహారాష్ట్రలో బీజేపీ, ఇండియా కూటమిలో పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు.  దరికుందే ఛాన్స్ అన్నట్టుగా ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్నారు. నిన్న, మొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌లు మాటల యుద్ధం చేసుకున్నారు. ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా కాంగ్రెస్, రాహుల్ గాంధీల మీద విరుచుకుపడ్డారు. ఈరోజు అమిత్ షా..మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్బని జిల్లా జింటూరులో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ బాబా పేరుతో ఉన్న విమానాన్ని 20 సార్లు ల్యాండ్ చేయడానికి సోనియాగాంధీ ప్రయత్నించగా 20 సార్లు కూలిపోయిందని కామెంట్ చేశారు.  అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో మళ్లీ మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఈసారి కూడా సోనియా ప్రయత్నం బెడిసికొడుతుందని జోస్యం చెప్పారు అమిత్ షా. 

Also Read: Movies: సూర్య కెరీర్‌‌లోనే అతి పెద్ద సినిమాగా కంగువ..విశేషాలివే..

ఇక కాంగ్రెస్ మీద మళ్ళీ పాత విషయాలో దాడి చేశారు అమిత్ షా.  అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగకుండా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఏళ్ల తరబడి నిలిపేసిందని ఆరోపించారు. నరేంద్ర మోడీ అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఔరంగజేబు కూల్చేసిన కాశీ విశ్వనాథ ఆలయానికి కారిడార్ నిర్మించారని గుర్తు చేశారు. ఇప్పుడు గుజరాత్‌లో స్వర్ణ సోమనాథ ఆలయాన్ని చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. భారతదేశాన్ని సురక్షితమైన, సౌభాగ్యవంతమైన దేశంగా మోడీ తీర్చిదిద్దారని అమిత్ షా పొగిడారు. 

Also Read :  వరుస కుదరని వ్యక్తితో స్వాతి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ నిర్వహించనున్నారు. దాని తర్వాత మూడు రోజుల్లో అంటే నవంబర్ 3న ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఇక్కడ ప్రధానంగా పోటీ ఇండియా కూటమి, ఎన్డీయేల మధ్యనే ఉంది. మరోసారి అధికారం చేజిక్కుంచుకోవాలని ఎన్డీయే కూటమి ప్రయత్నిస్తోంది. 

Also Read :  ప్లీజ్ మా దేశానికి రండి.. భారత్ ఆటగాళ్లకు పాక్ కెప్టెన్ రిక్వెస్ట్!

Also Read : త్వరలో ముగియనున్న ధరణి కథ.. రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు