/rtv/media/media_files/2025/01/31/MnROnGVlzXrsXVg292TR.jpg)
India Won The 4th T20 with England
మొత్తానికి సూర్య సేన అనుకున్నది సాధించారు. మధ్యలో కాస్త తడబడనా..వెంటనే పొరపాటును సరిదిద్దుకుని విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టీ20 సీరీస్ ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఈరోజు పూనేలో జరిగిన కీలక మ్యాచ్ లో టీమ్ ఇండియా సమష్టిగా రాణించడంతో 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 26 బంతుల్లో 51 పరుగులు చేినప్పటికీ ఫలితం దక్కలేదు. భారత బౌలర్లు హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.
ఇది కూడా చదవండి: Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు!
దూబే, పాండ్యా హీరోలు
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సూర్య కుమార్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కూడ టాప్ ఆర్డర్ విఫలమయ్యింది. సంజూ శాంసన్ 1, అభిషేక్ శర్మ 29 పరుగులకే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ అయితే ఘోరంగా డకౌట్ అయ్యాడు కూడా.ఒకే ఓవర్లో ఇంగ్లాండ్ బౌలర్ మహమూద్ మూడు వికెట్లను తీసి భారత జట్టును గట్టి దెబ్బ కొట్టాడు. అయితే మూడో డౌన్ లో వచ్చిన రింకూ 26 బంతుల్లో 30 పరుగలతో కాసేపు మెరుపులు మెరిపించడంతో జట్టు మళ్ళీ కోలుకుంది. ఇతని తర్వాత వచ్చిన శివమ్ దూబే 34 బంతుల్లో 53 పరుగులు, హార్దిక్ పాండ్యా 30 బంతుల్లో 53 పరుగులు చేసి అర్థ శతకాలతో జట్టు స్కోరును పెంచారు. దీంతో ఓవర్లు ముగిసే సమయానికి భారత స్కోరు 181 పరుగులు చేయగలిగింది.