/rtv/media/media_files/2025/01/05/RWmfwdNoYYReQmdiuGl2.jpg)
CM Revath Reddy good news on Rythu Bharosa
Rythu Bharosa: రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న సాగు రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సీఎం.. మార్చి 31లోగా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుభరోసా నిధులు జమచేస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ అప్పులపాలు చేశాడు..
ఈ మేరకు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశాడు. మనం అప్పుల్లో ఉన్నామని కేసీఆర్ చెప్పలేదు. గుమ్మిల గొద్ది డబ్బులున్నాయని అబద్దాలు చెప్పాడు. కానీ గుమ్మీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఆ గుమ్మీల కింది పందికొక్కుల్లా కేసీఆర్ కుటుంబం మిగులు బడ్జెట్ ను తినేసింది. అయినా అధైర్యపడకుండా ఇచ్చిన హామీలు నేరవేరుస్తున్నాం. రుణమాఫీ చేశాం. రైతు భరోసా రూ.15 వేల ఇస్తామని చెప్పినప్పటికీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రూ. 12 వేలు ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని జనవరి 26న ప్రారంభించుకున్నాం. కేసీఆర్ మాదిరిగా మేము ఎగ్గొట్టేవాళ్లం కాదు అన్నారు.
నన్ను బలంగా కొట్టే దమ్ముందా?
ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, జడ్పీటీసీలను వందకు వంద శాతం గెలిపించుకోవాల్సి బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే కేసీఆర్ సరిగా నిలబడే పరిస్థితి లేదు కానీ నన్ను బలంగా కొట్టే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్‌లో మందిని పోగేసుకుని సోది చెప్పుడు కాదు ముందు నిలబడడం నేర్చుకోమంటూ విమర్శలు గుప్పించారు. పెద్దాయనకు ఫామ్ హౌస్‌లో ఉండి మెదడు మొద్దు బారిపోయిందన్నారు. ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్‌కు లైకులు బాగానే వస్తాయంటూ నెట్టింట చక్కర్లు కొట్టిన సర్వేపై కౌంటర్ వేశారు. షాద్ నగర్ పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ ఫామ్ హౌస్ లో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: Mali Mine: విరిగిపడిన కొండ చరియలు.. 10 మంది మృతి