/rtv/media/media_files/2025/01/07/H4KT9OkdJBUV7ylIZqsM.jpg)
Gold rates 07 Photograph: (Gold rates 07)
బంగారం ధర చుక్కలు చూపిస్తోంది. ఈరోజు ఒక్కరోజే పదిగ్రాముల పసిడి రూ.1100 పెరిగింది. దీంతో బంగారం ధరలు సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు బంగారం ధర 84, 900రూ. గా నమోదు అయింది. దేశీయంగా కొనుగోళ్ల మద్దతు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. జనవరి 1న 10 గ్రాముల పసిడి ధర రూ.79,390 ఉంటే...నెలాఖరుకు అది 5, 510రూ. పెరిగింది. ఇంతలా ధర పెరగడం ఇదే మొదటిసారని అంటున్నారు.
బలహీనపడిన రూపాయి..
మరోవైపు బంగారంతో వెండి సైతం పోటీ పడుతోంది. కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్ లో రూ. 95 వేలు దాటంది. నిన్న కిలో వెండి రూ. 94, 150 గా ఉంటే..ఈ ఒక్కరోజే రూ. 850 పెరిగింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 2800 డాలర్ల మార్కు దాటి ఇంట్రాడేలో 2859 డాలర్లకు ఎగబాకింది. మన రూపాయి బలహీనంగా ఉండడం బంగారం ధర పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇప్పటికే భారీగా క్షీణించింది. దీన్ని అడ్డుకొనేందుకు, బంగారం దిగుమతులను నిరుత్సాహ పరిచేందుకు దిగుమతి సుంకాన్ని వచ్చే బడ్జెట్లో పెంచుతారనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో ఉంది. అందువల్ల ధర మరింత పెరుగుతుందనే అంచనాతో వ్యారస్థులు ఎక్కువ కొనుగోలు చేసి ఉంచుతున్నారని చెబుతున్నారు. రేపు ప్రకటించే బడ్జెట్ ను బట్టి ఈ ధర మరింత పెరుగుతుందా...లేక తగ్గుతుందా అనేది తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు!